twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ‘ఆఫీసర్’ రిలీజ్ వాయిదా... కారణం ఏమిటి?

    By Bojja Kumar
    |

    నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆఫీసర్' మూవీ మే 25న విడుదల కావాల్సి ఉండగా... కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు. ఈ మేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జూన్ 1న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

    వర్మ టెక్నికల్ కారణాలు అని చెబుతున్నా.... ఫిల్మ్ నగర్లో ప్రచారం మరోలా ఉంది. ఇప్పటివరకు సినిమా బిజినెస్ జరగలేదని, ఏరియాల వారిగా సినిమాను అమ్మడానికి చూస్తున్నారని, ఈ ప్రాసెస్‌లో భాగంగానే సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    Officer release from 25 th May to 1st June

    'ఆఫీసర్' చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మైరా సరీన్ ఫిమేల్ లీడ్‌గా చేస్తోంది. ఆర్ కంపెనీ బేనర్లో సుధీర్ చంద్ర, రామ్ గోపాల్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    దాదాపు 25 సంవత్సరాల తర్వాత రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. వర్మ సినిమా అంటేనే విభిన్నంగా ఉంటుంది. మరి 58 ఏళ్ల నాగార్జునను పోలీస్ ఆఫీసర్‌గా వర్మ తెరపై ఎలా చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

    English summary
    “Since many technical elements of #Officer with regard to the best viewing experience are taking much longer than initially planned , we decided to postpone iamnagarjuna ‘s Officer release from 25 th May to 1st June” wrote RGV on his Twitter handle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X