జయలలిత బయోపిక్ తలైవి... రంగంలోకి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత, విజయేంద్రప్రసాద్.. దర్శకుడు ఎవరంటే!
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జే జయలలిత మరణం కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం ముంచింది. ఆమె లేని లోటు అటు రాజకీయాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది. జయలలిత మరణం తర్వాత ఆమె జీవితాన్ని భావితరాలకు చెప్పడానికి చాలా మంది సినీ ప్రముఖులు బయోపిక్‌లను తీస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన విష్ణు ఇందూరి తైలవి చిత్రానికి నిర్మాతగా మారడం సినీవర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

జయలలిత జన్మదినం రోజున
తాజాగా ఫిబ్రవరి 24వ తేదీ జయలలిత 71వ జన్మదినం. స్వర్గీయ నేత జన్మదినాన్ని పురస్కరించుకొని దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌ను ప్రకటించారు. తాను రూపొందించబోయే జీవిత చరిత్రకు తలైవి అనే టైటిల్‌ను ఖారారు చేశాం అని విజయ్ పేర్కొన్నారు.

తొమ్మిది నెలల పరిశోధన తర్వాత
గత తొమ్మిది నెలలుగా పరిశోధన చేస్తూ పూర్తిస్థాయి స్క్రిప్టును రూపొందించాం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తాం అని ఏఎల్ విజయ్ వెల్లడించారు.

అభ్యంతరాలు, వివాదాలకు దూరంగా
తలైవి బయోపిక్‌కు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. మేనల్లుడు దీపక్ నుంచి ఎన్‌వోసీ తీసుకొన్నాం. మొత్తం ఐదు జయలలిత బయోపిక్‌లు వస్తున్నందున, ఎలాంటి వివాదాల లేకుండా నిరభ్యంతర పత్రాన్నికుటుంబ సభ్యుల నుంచి తీసుకొన్నాం అని దర్శకుడు ఏఎల్ విజయ్ చెప్పారు.

విజయేంద్ర ప్రసాద్ కథా సహకారం
బాహుబలి, మణికర్ణిక చిత్రాలకు కథా సహాకారం అందించిన విజయేంద్ర ప్రసాద్ తలైవి చిత్రానికి పనిచేస్తున్నారు. స్టోరి టీమ్‌కు ఆయన లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం, నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా, మదన్ కార్వి పాటల రచయితగా పనిచేస్తున్నారు అని ఏఎల్ విజయ్ తెలిపారు.
విష్ణు ఇందూరి నిర్మాతగా
జయలలిత బయోపిక్ తలైవి చిత్రానికి నిర్మాతగా విష్ణు ఇందూరి వ్యవహరిస్తున్నారు. గతంలో సీసీఎల్‌కు అధినేతగా, ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌కు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా జయలలిత బయోపిక్‌ను కూడా విష్ణు ఇందూరి వ్యవహరించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











