వెంకటేష్ పెద్ద కుమార్తె హీరోయిన్ (అఫీషియల్)
హైదరాబాద్ : అటు పెద్ద హీరోలకు హీరోయిన్స్ సమస్య ఉంటే, ఇటు బాగా చిన్న హీరోలకూ అదే సమస్య వెంబడిస్తోంది. దాంతో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ అన్వేషణ టాలీవుడ్ లో తప్పనిసరి అయ్యింది. తాజాగా 'దృశ్యం'లో వెంకటేష్ పెద్ద కుమార్తెగా నటించిన కృతిక జయకుమార్ హీరోయిన్ గా పరిచయమవుతోంది.
'పూలరంగడు', 'అహనా పెళ్లంట' చిత్రాలకు సంభాషణలు అందించారు శ్రీధర్ సిపాన. ఇప్పుడాయన మెగా ఫోన్ పట్టబోతున్నారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. వచ్చే నెలలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''బసంతి'తో నటుడిగా ఓ మెట్టు ఎక్కాడు గౌతమ్. తనను మరో కోణంలో చూపించే సినిమా ఇది. వినోదాత్మకంగా సాగే ఈ కథ అన్ని వర్గాల వారినీ అలరిస్తుందన్న నమ్మకం ఉంది'' అని నిర్మాత తెలిపారు.

శ్రీధర్ సీపన..గతంలో పూలరంగడు, నిప్పు చిత్రాలుకు చేసారు. ప్రస్తుతం రవితేజ పవర్, గోపిచంద్ లౌక్యం చిత్రాలకు పనిచేస్తున్నారు. అయితే హీరోగా...అంతగా మార్కెట్ లేని గౌతమ్ ని ఎంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే... బ్రహ్మానందం కొడుకు గౌతమ్ తో సినిమా చేయటానికి మరో దర్శకుడు, నిర్మాత దొరికారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క హిట్టూ లేకుండా గెంటుకొస్తున్న గౌతమ్..రీసెంట్ గా బసంతి అనే ఫ్లాఫ్ చిత్రం చేసారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 రచయిత శ్రీధర్ సీపన దర్శకుడుగా మారుతూ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రారా కృష్ణయ్య నిర్మాత వంశీ కృష్ణ...నిర్మించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు పూర్తైందని, ఎంటర్టైన్మెంట్ బేస్ కధాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని శ్రీధర్ సీపన నిర్ణయించుకున్నాడని అంటున్నారు. గౌతమ్ సైతం ఈ ప్రాజెక్టు పై నమ్మకంతో ఉత్సాహంగా ఉన్నాడు. కొద్ది పాటి యాక్షన్..ఎక్కువ కామెడీతో చిత్రం నింపుతున్నారని, బ్రహ్మానందం సైతం చిత్రంలో కీలకమైన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











