‘టెంపర్’ అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇదే (ఫోస్టర్)
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘టెంపర్' మూవీ అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ రిలీజైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్ డిజైన్ పోస్టర్ విడుదల చేస్తున్నామని పూరి జగన్నాథ్ ప్రకటించినప్పటికీ అంతకంటే ముందుగానే ఇంటర్నెట్లో విడుదలైంది. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.


ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లెస్‌గా కనిపించ బోతున్నారు. ఈ ఫోటోలు నిన్ననే ఇంటర్నెట్లో లీకై హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు లీక్ చేసింది ఎవరో తెలిసి పోయింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ భార్య పోని వర్మ ఈ ఫోటోలు లీక్ చేసినట్లు ప్రకటించింది. ఎడిటింగ్ రూంలో నుంచే ఈ ఫోటో పెడుతున్నట్లు ట్విట్టర్ లో పెర్కొంది.

పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరోలను భిన్నంగా, తనదైన మార్కు కనిపించేలా స్టైలిష్‌గా చూపిస్తారు. తాజాగా ‘టెంపర్' చిత్రంలో తనదైన మార్కుతో జూ ఎన్టీఆర్‌ను ప్రజంట్ చేసాడు పూరి. తాజాగా ఇంటర్నెట్లో లీకైన జూ ఎన్టీఆర్ ఫోటోలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
‘టెంపర్' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో కాకుండా గుంటూరులో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. డిసెంబర్ 14వ తేదీన ఆడియో వేడుక ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











