»   » అఫీషియల్: అల్లు అర్జున్‌ను దిల్ రాజు ఎలా ఒప్పించాడో?

అఫీషియల్: అల్లు అర్జున్‌ను దిల్ రాజు ఎలా ఒప్పించాడో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(ఎస్.వి.సి) బేనర్లో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ ఖరారు చేస్తూ ఎస్.వి.సి ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని, 2017 సమ్మర్లో సినిమానురిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

గతంలో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు 'ఆర్య', 'పరుగు' చిత్రాలు నిర్మించారు. ఆర్య సినిమా సూపర్ హిట్టవ్వడంతో పాటు దిల్ రాజుకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే 'పరుగు' చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎందుకో ఆ తర్వాత నుండి బన్నీ, దిల్ రాజు కాంబినేషన్లో సినిమాలు రాలేదు.

OFFICIAL NOW: Allu Arjun's Next With Harish Shankar

దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అల్లు అర్జున్-దిల్ రాజు కలిసి సినిమా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్లతో తప్ప మామూలు దర్శకులతో సినిమాలు చేయడం లేదు. అయితే ఇపుడు దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అతను కమిట్ అవ్వడం చర్చనీయాంశం అయింది. దిల్ రాజు బన్నీకి ఏం చెప్పి ఒప్పించాడు? మంచి కథ కావడం వల్లనే బన్నీ బెండ్ అయ్యాడా? అనేది తెలియాల్సి ఉంది.

'సరైనోడు' సినిమా ప్రమోషన్ల సమయంలో తన తర్వాతి సినిమా తమిళ దర్శకుడు లింగుస్వామితో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విషయమై ఇంకా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. దీన్ని బట్టి ఇప్పట్లో వీరి కాంబినేషన్లో సినిమా ఉండటంతో లేదని స్పష్టమవుతోంది.

'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాకు ముందే అల్లు అర్జున్-హరీష్ శంకర్-దిల్ రాజు కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది. అయితే అప్పట్లో బన్నీకి కథ నచ్చక పోవడంతో ఒకే కాలేదని టాక్. ఇప్పటికి బన్నీకి స్టోరీ నచ్చడంతో సినిమా ఫైనల్ అయింది. 2017 సమ్మర్లో రిలీజ్ డేట్ అని ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుంది.

English summary
The most energetic combination is finally in place. Stylish Star Allu Arjun and director Harish Shankar are coming together for a project, which is to be bankrolled by Dil Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu