twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Official: హిందీలోకి ఛత్రపతి రీమేక్.. రాజమౌళి మూవీకి ఆ ఇద్దరు న్యాయం చేయగలరా?

    |

    టాలీవుడ్ హీరోలపై గత కొంత కాలంగా నార్త్ ఆడియెన్స్ అభిమానాన్ని గట్టిగానే పెంచుకుంటున్నారు. తెలుగు మాస్ కమర్షియల్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే హిందీ ఆడియెన్స్ ఎగబడి చూసేస్తున్నారు. బెల్లంకొండ సినిమాలను ఒక విధంగా తెలుగు ఆడియెన్స్ కంటే నార్త్ ఆడియెన్స్ ఎక్కువగా చూసినట్లు తెలుస్తోంది. ప్లాప్ సినిమాలకు కూడా మిలియన్ల వ్యూవ్స్ అందుతున్నాయి. ఇక ఛత్రపతి హిందీ రీమేక్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

    బడ్జెట్ కోట్లల్లో పెరుగుతూనే ఉంది

    బడ్జెట్ కోట్లల్లో పెరుగుతూనే ఉంది

    అల్లుడు శ్రీను సినిమాతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మార్కెట్ తో సంబంధం లేకుండా బడ్జెట్ కోట్లల్లో పెరుగుతూనే ఉంది. ఇక త్వరలో ఈ హీరో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా ఆ కథనాలు నిజమని తేలిపోయింది.

    ఎంతో మంది ట్రై చేశారు.. కానీ..

    ఎంతో మంది ట్రై చేశారు.. కానీ..

    రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి 2005లో రిలీజయ్యింది. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలన విజయాన్ని అందుకుంది. ఇక చాలా కాలంగా బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేయాలని కొందరు హీరోలు అనుకుంటూనే ఉన్నారు. ఇక మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ రంగంలోకి దిగాడు.

    దర్శకుడిగా వివి.వినాయక్

    దర్శకుడిగా వివి.వినాయక్

    అయితే సినిమాను రీమేక్ చేసే దర్శకుడు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో చాలా మంది దర్శకుల పేర్లు వైరల్ అయ్యాయి. మొదట సుజిత్ అనే టాక్ వచ్చింది. ఇక దర్శకుడిగా వివి.వినాయక్ అయితే బెటర్ అని ఫిక్స్ అయ్యారు. బెల్లంకొండ మొదటి సినిమా అల్లుడు శీను వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా వినాయక్ నే సెలెక్ట్ చేసుకోవడం విశేషం.

    Recommended Video

    Star Director On Cards For Chatrapathi Bollywood Remake
    రాజమౌళి స్థాయిలో న్యాయం చేయగలడా?

    రాజమౌళి స్థాయిలో న్యాయం చేయగలడా?

    ముందుగా సుజిత్ కి ఆఫర్ ఇచ్చినప్పటికీ.. అతను ఒప్పుకోలేదట. ఎలాంటి రీమేక్స్ చేయడం లేదని ఇటీవల క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు వినాయక్ తో పాటు రచయిత విజయేంద్రప్రసాద్ కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు రాజమౌళి స్థాయిలో సినిమాకు న్యాయం చేయగలడా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొంత కాలంగా వినాయక్ వరుస అపజయలతో సతమతవుతున్నాడు. అవకశాలు కూడా రావడం లేదు. అయితే రీమేక్ కథలకు న్యాయం చేయగలడనే గుర్తింపు ఉంది. మరి వినాయక్ ఏ విధంగా న్యాయం చేస్తాడో చూడాలి.

    English summary
    Bellamkonda sai srinivas , which is well known for its rakshasudu cinema, next he has been working on a few different concept films of the same way. Sai, who is making a film with Santosh Srinivas, alludu Adurs, has recently given the green signal for another project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X