మూడు భాషల్లో ప్రభాస్ కొత్త చిత్రం: అఫీషియల్‌గా ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్!
Recommended Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమా ఖరారైనట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభాస్ స్వయంగా తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సాహో తర్వాత తాను చేస్తున్న సినిమా గురువారం(సెప్టెంబర్ 6)న ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రభాస్ మూవీ
మూడు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోందని, కెకె రాధాకృష్ణ దర్శకత్వం వహించబోతున్నారని తెలిపారు. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించబోతున్నట్లు ప్రభాస్ వెల్లడించారు.

పూజా హెడ్గే
ఈ చిత్రంలో పూజా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోందని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్-పూజా కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది.

ప్రభాస్ 20
కె రాధాకష్ణ గతంలో తీసిన ‘జిల్' మూవీ నచ్చడం, అతడు చెప్పిన కథ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ప్రభాస్ ఓకే చెప్పాడట. ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ప్రభాస్ కెరీర్లో ఇది 20వ చిత్రం.

బరువు తగ్గుతున్నాడా?
బాహుబలి కోసం భారీగా బరువు పెరిగిన ప్రభాస్....సాహో కోసం స్లిమ్ లుక్‌లోకి మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ప్రస్తుతం ఉన్న బరువు కంటే 10 కేజీలు తగ్గనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











