రజనీ ‘కొచ్చాడయాన్’ రిలీజ్ డేట్ (అఫీషియల్)
హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'కొచ్చాడయాన్' చిత్రం విడుదల తేదీ అపీషియల్‌గా ఖరారైంది. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని రజనీకాంత్ పిఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'సూపర్ స్టార్ నటించిన 'కొచ్చాడయాన్', భారత్ దేశంలో తెరకెక్కిన తొలి ఫోటోరియలిస్టిక్ మోషన్ కాప్చర్ చిత్రం మే 1న విడుదల అవుతోంది. చరిత్ర సృష్టించబోతోంది' అంటూ ఆయన ట్వీట్ చేసారు. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కొచ్చాడయాన్ చిత్ర నిర్మాతలు, పంపిణీ దారులు ఈ రోజు(ఏప్రిల్ 10) సినిమా విడుదల విషయమై సమావేశం అయ్యారు. మే 1 నుండి 10 వరకు వివిధ డేట్స్ పరిశీలించారు. చివరకు మే 1న విడుదల చేయడమే మంచిందని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మేడే హాలీడే సినిమాకు వసూళ్ల పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.
రజనీకాంత్-దీపిక పదుకోన్ జంటగా నటించిన ఈ చిత్రానికి రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహించారు. 3డి మోషన్ క్యాప్చర్ యానిమేషన్ పార్మాట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. దీపిక పదుకోన్, జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. తెలుగులో ఈచిత్రం 'విక్రమ సింహ' పేరుతో విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











