Prabhas ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. యానిమల్ పార్క్‌ కంటే ముందే.. రెబల్‌స్టార్‌తో సందీప్ వంగా మూవీ

సందీప్ రెడ్డి వంగా... అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా మరో సంచలనం సృష్టించాడు. ఇక సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ మూవీ ప్రాజెక్ట్స్ అప్ డేట్స్ వచ్చాయి. ఒకే బ్యానర్ లో మూడు సినిమా చేయనున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. అయితే మొదట ప్రభాస్ తోనే ఆయన సినిమా చేయనున్నాడు. ఆ తర్వాతే యానిమల్ పార్క్. ఆ నెక్ట్స్ మూవీ ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో విజయ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసి సంచనలం సృష్టించాడు సందీప్ వంగా రెడ్డి. ఇక అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఇక షాహిద్ కపూర్ ఆ సినిమాలో హీరోగా నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక తాజాగా సందీప్ రెడ్డి వంగా .. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్‌ కపూర్‌ తో 'యానిమల్' సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాతో ఆయన మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నాడు.

Official: Sandeep Vanga Bhushan Kumar Gear up For Prabhas Spirit Animal Park Allu Arjun Movies

యానిమల్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటించింది. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా 18 రోజుల్లో దాదాపు 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు కొల్లగొట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి.. ఈ సినిమాను కొనుక్కున్న దిల్ రాజుకు కాసుల వర్షం కురిపిస్తుంది.

యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా క్రేజ్.. మరింత పెరిగింది. మొదటి సినిమాతోనే తానేంటో.. తన మేకింగ్ ఎలా ఉంటుందో.. చూపించిన సందీప్ వంగా... తాజాగా యానిమల్ మూవీతో మరోసారి తన స్టైల్ ఆఫ్ థింకింగ్‌ తో అందరినీ షాక్ కు గురిచేశాడు. ఇక సందీప్ రెడ్డి సినిమాలకు విమర్శకులు సైతం ప్రసంశలు వస్తుంటాయి. ఇక ప్రస్తుతం ఆయన తీయబోయే సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Official: Sandeep Vanga Bhushan Kumar Gear up For Prabhas Spirit Animal Park Allu Arjun Movies

సందీప్ రెడ్డి వంగాతో సినిమా తీయాలంటే అందరి వల్ల కాదనే చెప్పాలి. ఆయనతో సినిమా తెరకెక్కించాలంటే... ఆ నిర్మాతకు కూడా సినిమాల పట్ల అంతే ప్యాషన్ ఉండాలి. అప్పుడే ఆ కాంబో వర్కవుట్ అవుతుందని తెలుస్తోంది. అలా సందీప్‌తో తొలి నుంచీ ట్రావెల్ అవుతున్న ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్. తాజాగా వచ్చిన యానిమల్, అంతకుముందు సందీప్ తీసిన కబీర్ సింగ్ ఆయనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

ఇక సందీప్ రెడ్డి వంగా, నిర్మాత భూషణ్ కుమార్ కాంబోలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయి. అందులో ప్రభాస్ హీరోగా రూపొందనున్న స్పిరిట్ ఒకటి కాగా మరొకటి యానిమల్ పార్క్, మూడోది అల్లు అర్జున్ ప్రాజెక్ట్. అయితే వీటిలో మొదట ప్రభాస్ తోనే స్పిరిట్ సినిమా తెరకెక్కించనున్నాడట. ఆ తర్వాతే యానిమల్ పార్క్. ఈ రెండు సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X