‘ఐ’ విడుదలపై అఫీషియల్ ప్రెస్ నోట్
దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతలతో ఒకరైన ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ...‘శంకర్ తీర్చిదిద్దిన ‘ఐ'ని మేము తెలుగు ప్రేక్షకులకు మా మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.

డిసెంబర్ నెలలో గ్రాండ్ గా ఫంక్షన్ నిర్వహించి ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెస్తాము అని ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.
వాస్తవానికి ఈచిత్రం ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉంది. అయితే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రీ రికార్డింగు పూర్తి కాక పోవడమే ఆలస్యానికి అంటున్నారు నిర్మాత. రీ-రికార్డింగ్ అదిరిపోవాలనే పట్టుదలతో రహమాన్ ఉన్నారు. అందుకని ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ చిత్రం విడుదలలో జాప్యం జరగడానికి ఇదే కారణం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేస్తాం'' అని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











