Pawan Kalyan: ప్లీజ్.. అలా చేయకండి.. పవన్ ఫ్యాన్స్ కు రిక్వెస్ట్..

Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ..ఏపీ రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నారు. అయితే గతంలో ఒప్పుకున్న సినిమాలను చేసేందుకు సమయం దగ్గరికి దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ తరుణంలోనే ఓజి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే.. ఈ సినిమాపై మూవీ మేకర్స్ ఓ కీలక ప్రకటన చేశారు. అందులో కాస్త ఓపిక పట్టండంటూ పవన్ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ మూవీ మేకర్స్ ఎందుకు అలా రిక్వెస్ట్ చేశారంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఓజి. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ పోస్టర్స్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో ఓజీ సినిమా కోసం రోజురోజుకు అభిమానులలో ఆత్రుత పెరిగిపోతుంది.

OG movie makers requested to power star Pawan Kalyan fans

దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఎక్కడ కనిపించిన ఏ సభకు వెళ్లిన అక్కడ తన ఫ్యాన్స్.. ఓజీ.. ఓజీ.. అంటూ అరుస్తున్నారు. పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. సమయం సందర్భం లేకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి స్లొగన్స్ చేయవద్దు అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఓజీ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఓ రిక్వెస్ట్ చేశారు. ఇంకొన్నాళ్ళు ఓపికగా ఎదురుచూడండి అంటూ ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేసుకున్నారు.

ఈ తరుణంలో ఓ జి సినిమా మూవీ మేకర్స్ డివివి ప్రొడక్షన్స్ ఓ కీలక ప్రకటన చేసింది. 'OG సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాం, OG సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నాం. కానీ, మీరు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు సమయం, సందర్భం చూడకుండా, OG, OG అని అరవడం వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు.

వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆ విషయం మన అందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని, ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025-OG పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. స్టే ట్యూన్ టూ డీవీవీ మూవీస్.. ఫర్ ఆల్ అప్డేట్స్' అంటూ ఓ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

More from Filmibeat

Read more about: pawan kalyan they call him og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X