OG Movie Live Updates: OG మూవీపై అంబటి రాంబాబు రివ్యూ.. నెటిజన్ల ఫైర్

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి.

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. ఇక ఈ మూవీని 250 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు.

OG Telugu Movie Live Updates

OG షూటింగ్ దశలో ఉండగానే.. ఈ మూవీ బిజినెస్ క్రేజీగా సాగింది. తెలుగ రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, ఓవర్సీస్‌లో రికార్డు బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ గురించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్, విశేషాల గురించిన వివరాల్లోకి వెళితే..

LIVE Feed
  • Sep 26, 2025 11:45 AM

    OG మూవీపై అంబటి రాంబాబు రివ్యూ..

    ప్రజాదరణ పొందలేకపోయింది …!! న్యూట్రల్ ఆడియన్స్ సినిమా బాగాలేదు అని స్పష్టంగా చెప్తున్నారు !! - అంబటి రాంబాబు

  • Sep 25, 2025 9:08 PM

    యూఎస్‌లో తొలి రోజు కలెక్షన్లు

    ఓజీ సినిమా అమెరికాలో తొలి రోజు గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింద. కడపటి వార్తలు అందేసరికి ఈ చిత్రం 534 లొకేషన్లలో 1455 షోల దవ్ారా 11184 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా కరెంట్ బుకింగ్ భారీగా స్పందన కనిపిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

  • Sep 25, 2025 8:53 PM

    యూఎస్‌లో 3 మిలియన్ డాలర్లు

    అమెరికాలో ఓజీ సినిమాకు పెయిండ్ ప్రీమియర్ల ద్వారా భారీ కలెక్షన్లు లభించాయి. ఈ సినిమా ప్రీమియర్లకు 3.138 మిలియన్ డాలర్లు అంటే 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోను, అలాగే ఏ లిస్ట్ హీరోల టాప్ కలెక్షన్లుగా ఈ సినిమా నిలిచింది.

    యూఎస్‌లో 3 మిలియన్ డాలర్లు
  • Sep 25, 2025 4:32 PM

    అల్లు అర్జున్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన పవన్

    ప్రీమియర్స్ షో కలెక్షన్స్ విషయంలో కర్ణాటకలో ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న పుష్ప 2 (కోట్ల రూపాయలు) రికార్డులను ఓజీ బద్ధలు కొట్టింది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ మూవీకి ప్రీమియర్స్ ద్వారా 7 కోట్ల రూపాయల గ్రాస్ నమోదైంది. మొత్తంగా పెయిడ్ ప్రీమియర్స్‌కు గాను ఓవర్సీస్‌లో 27 కోట్ల రూపాయలు, ఇండియాలో 87 కోట్లు చొప్పున వరల్డ్ వైడ్‌గా 114 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది

  • Sep 25, 2025 2:02 PM

    ఓజీ రిలీజ్‌పై చిరంజీవి ట్వీట్

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. పవన్ కళ్యాణ్‌ను అందరూ ఓజాస్ గంభీరగా సెలబ్రెట్ చేసుకుంటుంటే ఆనందంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌, సుజీత్, డీవీవీ దానయ్య, థమన్‌లకు చిరు అభినందనలు తెలిపారు.

  • Sep 25, 2025 12:33 PM

    ఓజీ థియేటర్ల వద్ద నిరసన.. షోలు క్యాన్సిల్

    కర్ణాటకలోని బెంగళూరు నగరంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ప్రదర్శిస్తోన్న సంథ్య థియేటర్ వద్ద సెప్టెంబర్ 24న కన్నడిగులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఓజీ ప్రీమియర్స్‌ను థియేటర్ యాజమాన్యం షోలు రద్దు చేసింది

  • Sep 25, 2025 10:32 AM

    బుకింగ్స్‌లో ఓజీ దూకుడు

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శితమవ్వగా.. సెప్టెంబర్ 25న టికెట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. చివరి గంటలో దాదాపు 25.86K టికెట్స్ బుక్ అయినట్లుగా బుక్ మై షో గణాంకాలు చెబుతున్నాయి

  • Sep 24, 2025 11:17 PM

    ఓజీ థియేటర్‌లో అకీరా నందన్

    సుజిత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రీమియర్స్ వరల్డ్ వైడ్‌గా పడ్డాయి. ఈ సినిమాను వీక్షించడానికి పవన్ తనయుడు అకీరా నందన్ థియేటర్‌కు రావడంతో అభిమానులు ఈలలు, కేకలతో గోల చేశారు

  • Sep 24, 2025 10:21 PM

    ఓజీ థియేటర్‌లో ప్రశాంత్ నీల్ సందడి

    పవర్ ‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రీమియర్స్ వరల్డ్ వైడ్‌గా పడ్డాయి. ఈ సందర్భంగా విమల్ థియేటర్‌లో ఓజీని వీక్షించడానికి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వచ్చారు. ఆయనను చూసిన అభిమానులు.. ఈలలు, కేకలు వేశారు.

  • Sep 24, 2025 10:04 PM

    ఓజీ సూపర్‌ హిట్ కావాలి- నారా లోకేష్

    పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్.. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్ గాడ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నారా లోకేష్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు

  • Sep 24, 2025 9:42 PM

    సుజీత్ ఎమోషనల్

    ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు సుజిత్ ఎమోషనల్ అయ్యారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం, చిత్ర బృందం, అభిమానుల సహాయ సహకారాలపై సుజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో నోట్ విడుదల చేశారు.

    సుజీత్ ఎమోషనల్
  • Sep 24, 2025 8:08 PM

    ప్రపంచంలోనే తొలి షో

    ప్రపంచంలోనే తొలి షో బీహార్‌లోని పాట్నాలో సెప్టెంబర్ 24వ తేదీ 9.15 గంటలకు పడుతున్నది. ఇక రెండో షో 9.25 గంటలకు బెంగళూరులో, ఏపీ, తెలంగాణలో 9.30 గంటలకు ప్రీమియర్ షోలు ప్రారంభమవుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా పూర్తిస్థాయిలో 10 గంటల నుంచి స్క్రీనింగ్ ప్రారంభవుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ప్రపంచంలోనే తొలి షో
  • Sep 24, 2025 5:55 PM

    పవన్ కల్యాణ్ అరుదైన ఘనత

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అరుదైన ఘనతను తన కెరీర్‌లో అందుకోబోతున్నారు. ఈ సినిమా ద్వారా తొలి రోజే ఆయన 100 కోట్లు సాధించి రేర్ ఫీట్ సాధించనున్నారు. పవన్ కల్యాణ్ తొలి రోజు 100 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

  • Sep 24, 2025 5:50 PM

    హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ రచ్చ

    హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ప్రీమియర్లకు 5 కోట్ల రూపాయలు, తొలి రోజు కలెక్షన్లు 11.5 కోట్లు వసూలు చేసింది. దాంతో కడపటి వార్తలు అందేసరికి ఈ తొలి రోజు 16.50 కోట్లు కలెక్షన్లు నమోదు చేసింది. ఇంతకు ముందు ప్రీమియర్లు లేకుండా కల్కి చిత్రం 16.2 కోట్లు వసూలు చేసింది.

  • Sep 24, 2025 5:34 PM

    తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్

    తెలంగాణ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. ఓజీ మూవీ బెన్‌ఫిట్ షోలు, రెగ్యులర్ షో సినిమా టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ వరకు టికెట్ రేట్ల పెంపు ఉండకూడదని ఆదేశించినట్టు సమాచారం.

  • Sep 24, 2025 1:07 PM

    ఓజీ సినిమా విషయంలో

    ఓజీ సినిమా విషయంలో కనిపిస్తున్న మ్యాడ్‌నెస్ చూస్తే ముచ్చటేస్తున్నది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నయ్యకు, చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా బెస్ట్ విషెస్. ఈ సినిమా మెగా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. తప్పకుండా థియేటర్లలో ఫైర్ స్ట్రామ్ (అగ్ని తుఫాన్) క్రియేట్ చేస్తుంది. పవర్ స్టార్ గర్జన, రేంజ్‌ను ఎప్పుడెప్పుడూ చూడాలా? అనే ఉత్సాహం ఉంది అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

  • Sep 24, 2025 12:59 PM

    2.5 మిలియన్ డాలర్లు

    అమెరికాలో కడపటి వార్తలు అందేసరికి.. ఓజీ చిత్రం 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాదాపు 2433 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా.. 88253 టికెట్లు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ అనలిస్ట్ వెంకీ తెలిపారు.

  • Sep 24, 2025 12:57 PM

    కంటెంట్ ట్రావెలర్స్‌ను ఏర్పాటు

    ఓవర్సీస్‌లో పలు ప్రాంతాలకు సినిమా కంటెంట్ చేరడం ఆలస్యమైంది. ఈ విషయం అందర్నీ ఆందోళనకు గురిచేసింది. దాంతో కంటెంట్ సీడీలు, డిస్కులను చేరవేయడానికి అమెరికాలోని డిస్టిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ కంటెంట్ ట్రావెలర్స్‌ను ఏర్పాటు చేసి.. సకాలంలో థియేటర్లకు డిస్కులను చేరవేసింది. దాంతో ఈ సినిమాలు నిర్ణీత సమయానికే స్క్రీనింగ్ కావడానికి అవకాశం ఏర్పడింది.

  • Sep 24, 2025 12:29 PM

    డల్లాస్‌లో అభిమానుల సంబరాలు

    అమెరికాలోని డల్లాస్‌లో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఓజీ సినిమాను ప్రదర్శించే సినిమార్క్ థియేటర్ వద్ద 25 ఫీట్ల కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందుగానే పవన్ కల్యాణ్ అభిమానులు అక్కడికి చేరి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.

    డల్లాస్‌లో అభిమానుల సంబరాలు
  • Sep 24, 2025 12:26 PM

    అమెరికాలో సరికొత్త రికార్డులు

    అమెరికాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ప్రీ సేల్స్ విషయంలో కల్కి 2898 AD, దేవర, పుష్ప 2 సినిమాల రికార్డులను అధిగమించింది. సినిమార్క్ చైన్ థియేటర్లలో కల్కి చిత్రం 1.31 మిలియన్లు, దేవర చిత్రం 1.17 మిలియన్లు, పుష్ప 2 చిత్రం 1.12 మిలియన్లు వసూల చేస్తే.. ఓజీ చిత్రం 1.37 మిలియన్లు వసూలు చేసి టాప్‌గా నిలిచింది.

More from Filmibeat

Read more about: og pawan kalyan sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X