twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ బేబీ మూవీ ఫస్ట్ రివ్యూ: సమంత స్టార్‌డమ్‌కు పరీక్షగా..

    |

    టాలీవుడ్ హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత కెరీర్ తారాజువ్వలా దూసుకెళ్తున్నది. అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. స్టార్ డమ్ ఎంత అనే విషయాన్ని నిరూపించుకోవడానికి చేసిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందంటే..

    పొగరుబోతు పాత్రలో

    పొగరుబోతు పాత్రలో

    పొగరుబోతు బేబీగా సీనియర్ నటి లక్ష్మీ నటించింది. ఫ్యామిలీని సమస్యలకు నెట్టుతూ ఇబ్బందులకు గురిచేసే పాత్ర. ఓ కారణంగా బేీ ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అనూహ్యంగా యంగ్ బేబీ సమంత అక్కినేనిగా మారుతుంది. మళ్లీ తిరిగి వచ్చి ఫ్యామిలీకి చేరువవుతుంది. యవ్వనపు బేబీ కథను ఎలా నడిపించిందనే సినిమా కథ.

    సమంత అక్కినేని ఒంటిచేత్తో

    సమంత అక్కినేని ఒంటిచేత్తో

    సమంత ఈ సినిమాను ఒంటిచేత్తో నిలబెట్టింది. గోదావరి యాసలో ఆకట్టుకొన్నది. వృద్ధురాలిగా, యువతి పాత్రలోకి మారే తీరు సమంత నటనా ప్రతిభకు అద్దం పట్టేలా ఉంటుంది. కామెడీ ఓకే అనేలా ఉందనేది ఫస్ట్ రిపోర్ట్. సమంత ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది.

    రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్

    రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్

    నాగశౌర్య పాత్ర పరిధి తక్కువే కానీ. . ఆకట్టుకొన్నాడు. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. లక్ష్మీ సజ్జా ఒకే అనిపించాడు. మిగితా క్యారెక్టర్లు అంతాగా రిజిస్టర్ అయ్యే పరిస్థితి లేదు. ప్రధానంగా సమంత పాత్ర చుట్టే కథ తిరుగుతుంటుంది అని తెలుస్తున్నది.

    డైరెక్టర్ నందినీరెడ్డి గురించి

    డైరెక్టర్ నందినీరెడ్డి గురించి

    కథలోకి వెళ్లడానికి దర్శకురాలు నందినీ రెడ్డి కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నట్టు మాట వినిపిస్తుంది. లక్ష్మీ యంగ్ బేబీగా మారి సమంత రూపంలోకి వచ్చిన తర్వాత కథను బాగా హ్యాండిల్ చేశారనేది ఓవర్సీస్ రిపోర్ట్. సమంత బాడీ లాంగ్వేజ్‌ను కొత్తగా చూపించడంలో సక్సెస్ అయిందనేది తాజా రిపోర్ట్.

    మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి

    మిక్కీ జే మేయర్ మ్యూజిక్ గురించి

    మిక్కి జే మేయర్ మ్యూజిక్‌పై ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియెన్స్ పెదవి విరుస్తున్నట్టు సమాచారం. సెకండాఫ్‌ కొంత డల్‌గా ఉండటానికి కారణం మ్యూజిక్ బాగా లేకపోవడమే అన్న మాట వినిపిస్తున్నది. చాలా బాగుంది పాట బాగుందంటున్నారు. సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ పాయింట్. సెకండాఫ్‌లో ఎడిటింగ్‌పై దృష్టిపెట్టాల్సింది అనే మాట వినిపిస్తున్నది.

    మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో

    మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో

    ఫస్డ్ డే ఫస్ట్ షో రిపోర్టు ప్రకారం.. ఓ బేబీ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా ఉంటుంది. సెంటిమెంట్ ఆర్టిఫిషయల్‌గా అనిపిస్తుంది. కేవలం సమంత వల్లనే సినిమాకు ప్లస్ అవుతుంది. లక్ష్మీ భూపాల మాటలు బాగున్నాయి అని తెలుస్తున్నది. కొద్దిసేపు ఆగితే తెలుగు ఫిల్మీబీట్ పూర్తి రివ్యూ వస్తుంది.. Stay tune with Telugu Filmibeat.

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    సమంత అక్కినేని, లక్ష్మీ, నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రావు రమేష్, తేజ సజ్జా, ప్రగతి, ఐశ్వర్య, ఉర్వశి, ప్రియదర్శి, ధనరాజ్, అడివి శేషు
    స్క్రీన్ ప్లే, డైరెక్టర్: బీవీ నందినీరెడ్డి
    నిర్మాతలు: డీ సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వ ప్రసాద్, థామస్ కిమ్
    మాటలు: లక్ష్మీ భూపాల
    సంగీతం: మికీ జే మేయర్
    సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్
    ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
    రిలీజ్: 2019-07-05

    English summary
    Samantha Akkineni is facing a critical situation after marriage. She said, I am not getting offers after Marriage. film offers dried up when she announced her marriage with Naga Chaitanya. Now She is doing Oh! baby and Manmadhudu movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X