15న దిల్ రాజు ‘ఓ మై ఫ్రెండ్’ ఆడియో
సిద్ధార్థ, శృతి హాసన్, నవదీప్, హన్సిక ప్రధాన పాత్రదారులు రూపొందుతున్న దిల్ రాజు నెక్ట్స్ మూవీ ఓమై ఫ్రెండ్ ఆడియో ఈ నెల 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం హైదబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మళయాల మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్ట పడి ఆరు పాటలు కంపోజ్ చేశాడు రాహుల్. వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వేణు శ్రీరామ్ గతంలో బొమ్మరిల్లు భాస్కర్, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు.
నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని ఫిల్మ్ నగర్ టాక్. దర్శకుడు తన నిజ జీవితంలో స్కూల్ మేట్ తో అనుభవాల ఆధారంగా ఈ కథని తయారు చేసుకున్నట్లు చెప్తున్నాడు. ఇందులో సిద్దార్ధ, శృతి హాసన్ సంగీతంతో ముడిపడి ఉన్న పాత్రల్లో కనిపించ బోతున్నారు. నవదీప్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్‌గా, హన్సిక బిజినెస్ ఉమెన్‍గా కనిపించబోతున్నారు. ఈ మూవీకి కోప్రొడ్యూసర్స్: శిరీష్లక్ష్మణ్, లైన్ ప్రొదిలడ్యూసర్: అశోక్.


Click it and Unblock the Notifications











