‘ఓ మై ఫ్రెండ్’ దర్శకుడు తండ్రి మరణం..శ్రద్దాంజలి
మొన్న శుక్రవారం విడుదలైన 'ఓ మై ఫ్రెండ్" చిత్ర దర్శకుడు వేణు శ్రీరాం తండ్రి ప్రమాదవశాత్తూ మృతిచెందారు. కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లిలోని ఓ మూడంతస్తుల భవనంపై నుంచి పడి ఆయన మృతిచెందినట్లు కుటుంబ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఓ మై ప్రెండ్ హీరో సిద్దార్ద ట్వీట్ చేస్తూ..వేణు శ్రీరామ్ తండ్రి పోయిన వార్త తెలిసిందని, తనకు మాటలు రావటం లేదన్నారు. అలాగే హీరోయిన్ శృతి హాసన్ స్పందిస్తూ... నా డీపెస్ట్ కండోలెన్సెస్ టు అవర్ డైరక్టర్ వేణు శ్రీరామ్ అండ్ హిజ్ ప్యామిలీ అని ట్వీట్ చేసారు.
ఇక సిద్దార్ధ, శృతిహాసన్ కాంబినేషన్ లో విడుదలైన ఆ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు మాత్రం మెచ్యూరిటీతో స్నేహానుబంధాన్ని తెరపై ఎక్కించాడని పేరు తెచ్చుకున్నాడు. దిల్ రాజు సైతం ఈ చిత్రంపై చాలా ఆసలు పెట్టుకున్నాడు. యూత్ ని టార్గెట్ చేసిన ఈ చిత్రం స్లో నేరేషన్ తో ఉండటం కాస్త ఇబ్బంది అయినా మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు పట్టే అవకాశం ఉందంటున్నారు. మెల్లిమెల్లిగా ఈ చిత్రం యూత్ పల్స్ ని పట్టుకుని దూసుకుపోతుందని కొందరంటున్నారు.
తన తొలి చిత్రం విడుదలైన ఆనందంలో ఉండగానే తన తండ్రికి ఇలా జరగటం చాలా విషాదకరమైన విషయం. వేణు శ్రీరామ్ కీ, అతని కుటుంబానికి ధట్స్ తెలుగు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











