'ఓ మై ఫ్రెండ్'దర్శకుడు నెక్ట్స్ చిత్రం ఖరారు
దిల్ రాజు నిర్మించిన 'ఓ మై ఫ్రెండ్'రెండు వారాల క్రితం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.సిద్దార్ద హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ అనే దర్శకుడు పరిచయమయ్యాడు. ఈ దర్శకుడుకి రెండో చిత్రం ఇవ్వటానికి దిల్ రాజు రెడీ అయ్యారు.ఈ మేరకు ఆయన మీడియా చెప్తూ..గొప్ప సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నాం. దర్శకుడు వేణు శ్రీరామ్ తదుపరి చిత్రాన్ని కూడా మా సంస్థలోనే నిర్మించబోతున్నాం అన్నారు.అలాగే చిత్రం కలెక్షన్స్ గురించి చెపుతూ..కలెక్షన్ల పరంగా సిద్ధార్థ్ కెరీర్‌లో 'ఓ మై ఫ్రెండ్' అత్యుత్తమంగా నిలిచిందని అన్నారు. సిద్ధార్థ్, శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ ప్రధాన పాత్రధారులుగా వేణు శ్రీరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించారు.ఈ చిత్రం ప్రమోషన్ నిమిత్తం మీడియా సమావేశం నిర్వహించారు.
అంతేగాక ..మా సినిమా రెండో వారంలో మూడు సినిమాలు విడుదలైనప్పటికీ అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. తొలి వారం అసాధారాణ వసూళ్లను సాధించింది. మొదట డివైడ్ టాక్ వచ్చినా, దానితో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ముఖ్యంగా యువత, కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు.తొలి వారం కంటే రెండో వారంలో ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ మరింత ఎక్కువైంది. అన్ని ప్రాంతాల నుంచీ మరిన్ని కొత్త ప్రింట్లు కావాలని అడుగుతున్నారు. అనేక కాలేజీ యాజమాన్యాల వారు, విద్యార్థులు ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనల కోసం మమ్మల్ని ఎక్కువగా సంప్రదిస్తున్నారు. టాక్‌తో సంబంధం లేకుండా సినిమాకు అంతిమంగా ప్రేక్షకులే విజయాన్ని అందించారు. వాళ్లకి మా ధన్యవాదాలు. మంచి సినిమాలకు ఆదరణ ఎల్లప్పుడు ఉంటుందని ఈ సినిమాతో మరోసారి రుజువయింది అని వివరించారు.


Click it and Unblock the Notifications











