మణిరత్నం ‘ఓకే బంగారం’ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?
హైదరాబాద్: మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్-నిత్యా మీనన్ జంటగా తెరకెక్కిన ‘ఓకే బంగారం' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. నిన్న రాత్రి నుండే పలు చోట్ల ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం సినిమా ప్రేక్షక రంజకంగా ఉందని, సూపర్ హిట్ అని అంటున్నారు.
గత కొన్నేల్లుగా మణిరత్నం నుండి ఒక్క హిట్టూ లేదు. ఆయన గత సినిమాలు రావన్, కడలి చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ‘ఓకే బంగారం' చిత్రంతో మణిరత్నం మళ్లీ ఫాంలోకి రావడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే మణిరత్నం మరోసారి ఈ చిత్రంలో తన మార్కు చూపించాడు.
మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.

ముఖ్యంగా రావణ్, కడలి వంటి ఫెయిల్యూర్ చిత్రాలు తర్వాత వస్తున్న చిత్రం కావటం...ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పోస్టర్స్, ఆడియో మళ్లీ సఖి చిత్రం రేంజిలో ఆసక్తి రేపుతూండటంతో అందరిలోనూ చూడాలనే ఉత్సుకత రేగుతోంది. అందిరోనూ ‘మణిరత్నం ఈజ్ బ్యాక్' అనే ఆలోచనే ఉంది. అంతా ఊహించిన విధంగానే సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.
వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లే ముందు ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ముంబయిలోని ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ క్రమంలో వారిద్దరి మధ్య చోటు చేసుకొన్న పరిణామాలు ఎలాంటివన్నది ఈ సినిమా స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











