ఆగస్టు 31న హన్సిక ‘ఓకే ఓకే’
హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్, హన్సిక జంటగా ఎం. రాజేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ఓకే ఓకే' చిత్రం తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. మల్టీ డైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు.. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ 'ఆగస్టు 31న 'ఓకే ఓకే' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇటీవలే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో పెద్ద హిట్టఅయింది. హారిష్ జైరాజ్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ చేసారు. విజువల్‌గా కూడా పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి.
తమిళంలో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయి రూ. 40 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అదే విధంగా తెలుగులో కూడా ఘన విజయం సాధించి మా బేనర్‌కి మంచి పేరు తెస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు.
జూనియర్ 'ఖుష్బూ'గా పేరు తెచ్చుకున్న హన్సిక తమిళనాట మంచి క్రేజ్ సంపాదించింది. అనతి కాలంలోనే అక్కడ నాలుగు సినిమాలు చేసి ఊహించనంత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. 'ఓకే ఓకే' చిత్రంతో హిట్ అందుకుని హీరోయిన్ల రేసులో నంబర్ వన్ స్థానానికి ఎదిగేసింది. మరి తెలుగులో హన్సిక ఓకే ఓకే అదృష్టం ఎలా ఉందో చూడాలి.


Click it and Unblock the Notifications











