ఒక చూపుకే పడిపోయా...(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: శ్రీమతి యార్లగడ్డ కృష్ణ వేణి సమర్పణలో ప్రియాంక ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ, ప్రియాంక, గ్రీష్మ హీరో హీరోయిన్లుగా శ్రీనివాసరావు ర్యాలీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లవ్లీ ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'ఒక చూపుకే పడిపోయా'. యార్లగడ్డ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈచిత్రంలో యు.బి.రాజు కీలకపాత్రధారి. సోమవారం ఈ చిత్ర ప్రారంభోత్సవం హైద్రాబాద్, అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది.

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇవ్వగా..ఎమ్మెస్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. చిత్ర దర్శకుడు శ్రీనివాసరావు ర్యాలీ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత యార్లగడ్డ రామ్మోహనరావు మాట్లాడుతూ...'దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్. సింగిల్ షెడ్యూల్‌తో చిత్రాన్ని పూర్తి చేస్తాం. మూడు పాటలు అరకులో చిత్రీకరించనున్నాం. ఈ చిత్రంలో 6 పాటలున్నాయి. రికార్డింగ్ పూర్తయింది. ఇందులో ఓ ప్రముఖ కథానాయకుడి హిట్ సాంగును ఆయన అనుమతితో రీమిక్స్ చేసాం' అన్నారు.

సస్పెన్స్ లవ్ ఎంటర్టెనర్

సస్పెన్స్ లవ్ ఎంటర్టెనర్


చిత్ర దర్శకుడు శ్రీనివాసరావు ర్యాలీ మాట్లాడుతూ...‘రొటీన్‌కు భిన్నంగా ఉండే సస్పెన్స్ లవ్ ఎంటర్టెనర్ ఇది. ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చిన నిర్మాత యార్లగడ్డ రామ్మోహనరావుగారికి నా కృతజ్ఞతలు' అని అన్నారు.

కళ్యాణ్ కృష్ణ

కళ్యాణ్ కృష్ణ


కథానాయకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ..‘ఈ చిత్రంలో నేను బద్రి అనే కాలేజ్ స్టూడెంట్ పాత్ర చేస్తున్నాను. దర్శకుడు చెప్పిన కథ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమా ఒక మంచి ప్యామిలీ ఎంటర్టెనర్‌గా రూపొందనుంది.' అన్నారు.

యు.బి.రాజు

యు.బి.రాజు


ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న యు.బి.రాజు మాట్లాడుతూ..‘దర్శకుడు చెప్పిన కథ, ఆ కథలోని ఎన్నారై పాత్ర నాకు నచ్చడంతో...ఈ చిత్రంలో నటిస్తున్నాను. అన్నారు.

హీరోయిన్లు

హీరోయిన్లు


ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రియాంక, గ్రీష్మ్ ఈ అవకాశం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్


బేబీ కారుణ్య, మాస్టర్ అనుదీప్, యు.బి.రాజు, అవినాష్ తాటికొండ, వినోద్, నరసింహరాజు, గుండు సుదర్శన్, పొట్టి చిట్టిబాబు, జివికె.గోపీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఛాయాగ్రహణం: మురళి మందరాడ, కళ: విజయకృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కొండపల్లి నందు, సమర్పణ: శ్రీమతి యార్లగడ్డ కృష్ణ వేణి, నిర్మాత: యార్లగడ్డ రామ్మోహనరావు, రచన-దర్శకత్వం: శ్రీనివాసరావు ర్యాలీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X