Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ ముద్దు సీన్లతో థియేటర్లు నిండుతాయా? (ఫోటోలు)
హైదరాబాద్: శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్లో మనోజ్ నందన్, అనిల్ కళ్యాణ్, ప్రియాంక నటీనటులుగా తెరకెక్కబోతున్న సినిమా 'ఒక క్రిమినల్ ప్రేమకథ'. కృష్ణ మూర్తి సమర్పణలో యక్కాలి రవీంద్రబాబు నిర్మాతగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సినిమాపై ప్రేక్షకుల్లో...ముఖ్యంగా యూత్‌లో ఆసక్తి కలిగేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముద్దు సీన్లకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసారు. ఇలా చేయడం ద్వారా థియేటర్లు నిండి మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్లైడ్ షోలో ముద్దుసీన్లకు సంబంధించిన ఫోటోలు...
90 సెకన్ల ముద్దు సీన్
సినిమాలో మొత్తం 90 సెకన్ల పాటు ఈ ముద్దు సీన్ ఉంటుందట. సన్నివేశం చిత్రీకరణ సమయంలో హీరో హీరోయిన్లు మనోజ్, ప్రియాంక చాలా భయ పడ్డారని, టేకుల మీద టేకులు తీసుకుంటూ 8 గంటల పాటు ఈ ముద్దు సీన్ చిత్రీకరణ జరిగిందని నిర్మాత రవీంద్ర బాబు తెలిపారు.
సినిమా గురించి దర్శకుడు
రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా తర్వాత ఆ రేంజిలో కాన్సెప్టు ఉన్న సినిమా అని దర్శకుడు సునీల్ కుమార్ తెలిపారు. మనం చాలా విషయాలను ఎవరికీ తెలియకుండా పరదాల వెనక దాస్తుంటాం. అటువంటి విషయాలను ఒక జర్నలిస్టుగా, సొసైటీకి ఏం అవసరం అనేది ఒక పాజిటివ్ వేలో ఈ సినిమా ద్వారా చూపిస్తున్నాం అన్నారు. సినిమాను చాలా బోల్డ్‌గా చిత్రీకరించామని తెలిపారు.
నటీనటులు
దివ్య, మన్ ప్రీత్ కౌర్, సత్యానంద్ ఎల్, జి.రమేష్, ఎఫ్.ఎం. బాబాయ్, బుగత సత్యనారాయణ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
టెక్నీషియన్స్
ఈచిత్రానికి కెమెరా: సాబు జేమ్స్, ఎడిటింగ్: అర్చన, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కో-ప్రొడ్యూసర్: కుర్రా విజయ్ కుమార్, నిర్మాత: యక్కాలి రవీంద్రబాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి.