దీనమ్మ జీవితం...ఒక గన్ను, 6 బుల్లెట్లు!

By Bojja Kumar

యూ ట్యూబ్‌లో బాగా పాపులర్ అయిన 'దీనమ్మ జీవితం' అనే లఘుచిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్ వర్మ తాజాగా 'ఒక గన్ను 6 బుల్లెట్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో 'సినిమాకెళ్దాం రండి' చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ తమ రెండో చిత్రంగా 'ఒక గన్ను 6 బుల్లెట్లు' చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. పలు లఘు చిత్రాలు, మ్యూజిక్ వీడియోలకు డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.

'ఒక గన్ను 6 బుల్లెట్లు' చిత్రాన్ని సునీత ప్రభాకర్, సీత నెక్కంటి నిర్మిస్తున్నారు. ఇంకా కథానయకులు ఖరారు కాలేదు. త్వరలో ఇందులో యువ కథానాయకులను ఎంపిక చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఈచిత్రాన్ని క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు.

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. జులైలో చిత్రీకరణ మొదలు పెట్టి, అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలు తీసిన అనుభవం లేక పోయినా... దర్శకుడు చెప్పిన కథపై నమ్మకంతోనే సినిమా తీయడానికి ముందుకు వచ్చాం అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం శ్రవణ్, సమర్పణ : హారిక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X