టైం చూసి నాగచైతన్య ని వదులుతున్నారు

By Srikanya

హైదరాబాద్ : అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'ఒక లైలా కోసం'. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై తెరకెక్కుతోంది. శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మాత. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తునారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రం ఆడియోని ఆగస్టు 15న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆడియోవిడుదల రోజే ఫస్ట్ ట్రైలర్ కూడా విడుదల కానుంది. అంతేకాదు ఆ రోజు నుంచే ప్రమోషన్ ఏక్టివిటీస్ కూడా పెంచుతారు. ఈ లోగా పెద్ద సినిమాలు వరసగా విడుదల అవుతాయి. దాంతో ఈ చిత్రం గురించి జనం మాట్లాడుకుంటారని భావిస్తున్నారు. అలా ఫెరఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వస్తున్నారు.

‘Oka Laila Kosam’ audio on August 15th

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సున్నితమైన భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతోన్న రొమాంటిక్ ప్రేమకథాచిత్రమిది. ప్రేయసి కోసం ఓ ప్రియుడు ఏం చేశాడన్నదే ఇందులో ఆసక్తికరం. నాగచైతన్య పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. ఆయన నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వినోదంతో పాటు కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే ప్రచార చిత్రాలతో పాటు ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

ఫస్ట్‌లుక్‌ శనివారం విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం చిత్రం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. బ్రహ్మానందం, అలీ, ప్రభు, నాజర్‌, ఆశిష్‌ విద్యార్థి, సుప్రీత్‌, మధు, ప్రగతి, సుధ, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: పి.ఎస్‌.వర్మ, ఫైట్స్‌: విజయ్‌, కాస్ట్యూమ్స్‌: నీరజ కోన, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సాయిబాబా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X