నా పిల్లలు వారి పార్ట్‌నర్స్‌ను వాళ్లే వెతుక్కోవాలి: నాగార్జున
హైదరాబాద్: నాగచైతన్య, పూజా హెగ్డే హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం 'ఒక లైలా కోసం'. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున నిర్మాత. ఈ సినిమా రేపు (అక్టోబర్ 17) విడుదల చేస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, పూజా హెడ్గే, విజయ్ కుమార్ కొండ, అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.....నెలన్నర రోజులుగా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాం, మంచి డేట్ కుదరడంతో అక్టోబర్ 17న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మనం సినిమా కూడా మంచి డేట్ రోజున విడుదలైందని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని, ఫీల్ గుడ్ మూవీ అని నాగార్జున చెప్పుకొచ్చారు.
మీడియా వారు పరోక్షంగా నాగ చైతన్యకు పెళ్లెప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా...నా పిల్లలు వారి పార్ట్‌నర్స్‌ను వాళ్లే వెతుక్కోవాలని నాగార్జున సమాధానం ఇచ్చారు.
స్లైడ్ షోలో ఫోటోలు మరిన్ని వివరాలు...

నాగ చైతన్య మాట్లాడుతూ...
సినిమా అందరికీ నచ్చుతుంది. పూజా పాత్ర సినిమాకు హైలెట్ అవుతుంది. అలీ కామెడీ బాగుంటుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...
సినిమాలో హీరో పేరు కార్తీక్. హీరోయిన్ కి అందమైన గిఫ్ట్ ఇస్తాడు. ప్రపంచంలో ఏ ప్రేమికుడు తన ప్రేయసికి ఇప్పటి వరకు ఇవ్వని గిఫ్ట్ అది. అదేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నారు.

పూజా హెడ్గే మాట్లాడుతూ..
సినిమాలో చాలా కష్టమైన పాత్ర చేసాను. మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ..
నేను అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











