రేడియో స్టేషన్లో నాగ చైతన్య, పూజా సందడి (ఫోటోస్)
హైదరాబాద్: యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నిర్మిస్తోన్న చిత్రం 'ఒక లైలా కోసం'. గుండెజారి గల్లంతయ్యిందే వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఫ్రీడమ్ సాంగ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా రెడ్ ఎఫ్.ఎం.లో నాగ చైతన్య, పూజా హెడ్గే సందడి చేసారు.
స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు....

ఫ్రీడమ్ సాంగ్
ఈ చిన్ని లైఫ్ నీదే...సరదాగా సాగాలి... చేజారిపోతే రాదే..చెలరేగిపోవాలి అంటూ వనమాలి రాసిన పాటను ఆల్ఫోన్స్ పాడారు.

సాంగ్ రిలీజ్
నాగ చైతన్య, పూజా హెడ్డే, అనూప్ రూబెన్స్, విజయ్ కుమార్ కొండా రిలీజ్ చేసారు.

నటీనటులు
నాగ చైతన్య, పూజా హెడ్గే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అలీ, షాయాజీ షిండే, రోహిణి, సుమన్, సుధ, చలపతిరావు, ఎం.ఎస్.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, భరత్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, పైట్స్: రామ్ లక్ష్మణ్, విజయ్, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా.


Click it and Unblock the Notifications











