టీజర్ లోనే మొత్తం చెప్పేసాడు (వీడియో)
హైదరాబాద్ : అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూసేది చిత్రం ఫస్ట్ లుక్,టీజర్ కోసం. అందుకే ఇప్పుడు దర్శకులు తమ సినిమాపై ఎంత దృష్టి పెడుతున్నారో అంతకన్నా ఎక్కువ టీజర్ లో వచ్చే కంటెట్, డిజైన్ పై కాన్సర్టేట్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'ఒక లైలా కోసం'టీజర్ రిలీజైంది. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం దానికి తగ్గట్లే ఫన్నీ డైలాగులుతో, దాదాపు సినిమా కథ మొత్తం అర్దమయ్యేటట్లుగా టీజర్ వచ్చేసింది. మీరూ ఓ లుక్కేసి...మీ అభిప్రాయాల్ని క్రింద కామెంట్ల రూపంలో తెలపండి.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/czxwX89hA7Y" frameborder="0" allowfullscreen></iframe></center>
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతోంది. శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మాత. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహిస్తునారు. పూజా హెగ్డే నాయిక. ప్రస్తుతం చిత్రం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

బ్రహ్మానందం, అలీ, ప్రభు, నాజర్, ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, మధు, ప్రగతి, సుధ, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: పి.ఎస్.వర్మ, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: నీరజ కోన, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయిబాబా.


Click it and Unblock the Notifications











