twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు కూతురు నిహారిక ‘ఒక మనసు’ ఫస్ట్ లుక్ (ఫోస్టర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక త్వరలో హీరోయిన్ పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసారు.

    నాగ బాబు కూతురు నిహారికపై హరాస్మెంట్ కేసు వేస్తాం!నాగ బాబు కూతురు నిహారికపై హరాస్మెంట్ కేసు వేస్తాం!

    ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వచ్చింది. మరో వైపు నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ తో యాక్టింగ్ టాలెంట్ పరంగా తానేంటో నిరూపించుకుంది. వెబ్ సిరీస్ లో అదరగొట్టిన నిహారిక సినిమాలో మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

    Oka Manasu Pre Look Poster

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నాగశౌర్య తండ్రి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. అందువలన ఆ పాత్రకి ప్రకాశ్ రాజ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి ఆయనని తీసుకున్నారని అంటున్నారు.

    నిహారిక టెర్మ్స్ అండ్ కండీషన్స్.... (రొమాంటిక్ వీడియో)నిహారిక టెర్మ్స్ అండ్ కండీషన్స్.... (రొమాంటిక్ వీడియో)

    ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన రానుంది.

    హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

    English summary
    Niharika's Oka Manasu Pre Look Poster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X