Win Rs.10000: విలన్‌ను పట్టుకొంటే 10000 రూపాయలు.. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెనా?
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో నిర్మాత గార్లపాటి రమేష్, సహనిర్మాతలు జీను మల్లి - స్వాతి కళ్యాణి నిర్మించిన చిత్రం ఒక పథకం ప్రకారం. వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రచారం గురించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీలక్ష్మి ఫిలిమ్స్ బాపిరాజు ఈ సినిమాను భారీగా, గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమాపై క్యూరియాసిటినీ కలిగించేందుకు ఆడియెన్స్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు. ఈ సినిమాను ఇంటర్వెల్ వరకు చూసి.. ఈ మూవీ కథలో విలన్ ఎవరో కచ్చితంగా చెప్పగలిగిన వారికి భారీ బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 50 థియేటర్లలో సినిమా చూసిన ఆడియెన్స్‌లో విలన్ ఎవరో గుర్తించిన వారికి 10 వేల రూపాయల చొప్పున బహుమతి అందిస్తాం హీరో సాయిరాం శంకర్ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 300 స్క్రీన్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. దాదాపు 50 థియేటర్లను ఈ పోటీకి ఎంపిక చేశాం. 50 మందికి కలిపి మొత్తంగా 5 లక్షల రూపాయలు బహుమతిగా ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యాం. ఎందుకంటే మా కథపై, మేము అనుసరించిన స్క్రీన్‌పై మాకు అంత నమ్మకం. చూసే వారికి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అని హీరో సాయిరాం శంకర్ అన్నారు.
ఒక పథకం ప్రకారం సినిమా మర్డర్ మిస్టరీనే కాదు. ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరి. ఈ సినిమా స్టోరీ నేరేషన్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ 10 నిమిషాలకు ఓ ట్విస్టు ఉంటుంది. ఆ ట్విస్టులు కొత్త అనుభూతికి గురి చేస్తాయి. సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు క్యూరియాసిటీని పెంచుతాయి. క్యారెక్టర్ల విషయంలో చాలా మిస్టరీ ఉంటుంది. అందుకే ఈ సినిమాలో విలన్ ఎవరో కనిపెట్డడం కష్టంగా ఉంటుందనే భావిస్తున్నాం. అందుకే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించినా ఈ పోటీని నిర్వహించడానికి ముందుకు వచ్చాం అని దర్శకుడు వినోద్ విజయన్ అన్నారు.
నటీనటులు: సాయిరాం శంకర్, శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని, రవి పచ్చముత్తు, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ తదితరులు
సినిమాటోగ్రఫి: రాజీవ్ రాయ్
మ్యూజిక్: రాహుల్ రాజ్, ఆర్.ఆర్: గోపి సుందర్
ఎడిటింగ్: కార్తీక్ జోగేష్
ఆర్ట్; సంతోష్ రామన్
లిరిక్స్: రహమాన్
సింగర్: సిడ్ శ్రీరామ్
సహనిర్మాతలు: జీను మల్లి, స్వాతి కల్యాణి
బ్యానర్స్: వినోద్ విహాన్ ఫిల్మ్స్ - విహారి సినిమా హౌస్ ప్రయివేట్ లిమిటెడ్
నిర్మాతలు: వినోద్ కుమార్ విజయన్ - గార్లపాటి రమేష్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: వినోద్ కుమార్ విజయన్


Click it and Unblock the Notifications











