twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’కన్నడ రీమేక్ ప్రారంభం

    By Srikanya
    |

    హైదరాబాద్ తెలుగులో ఘన విజయం సాధించిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రం ఇప్పుడు కన్నడం ప్రేక్షకులను అలరించటానికి ముస్తాబు అవుతోంది. మలినేని ప్రొడక్షన్స్ పతాకంపై మలినేని లక్ష్మయ్య రీమేక్ చేస్తున్నారు. నూతన నటీనటులు నటించనున్న ఈ చిత్రం ద్వారా ఎన్.షసూన్ రాజు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా సంస్థలోగోను హైదరాబాద్‌లో డి. రామానాయుడు ఆవిష్కరించారు.

    నిర్మాత మాట్లాడుతూ 'గతంలో నిర్మాతగా, నటుడిగా, ఫైనాన్షియర్‌గా వ్యవహరించాను. కొంత విరామం తరువాత మళ్లీ సినిమా నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నాను. మంచి కథ కోసం వెతుకుతున్న సమయంలో తెలుగులో సునీల్‌కుమార్‌డ్డి దర్శకత్వం వహించగా విజయవంతమైన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చూశాను. సినిమా నచ్చింది. ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నాను. డిసెంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. ఈ సినిమా ద్వారా ఎన్.షసూన్ రాజును దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మా సంస్థలో సినిమాలతో పాటు సీరియల్స్‌ను కూడా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి నుంచి సునీల్‌కుమార్‌డ్డితో ఓ చిత్రాన్ని చేయబోతున్నాను' అన్నారు.

    Oka Romantic Crime Katha’ to be remade in Kannada

    ఇక రీమేక్ చేసేటంతటి మ్యాటర్ ఈ చిన్న సినిమాలో ఏముంది? దర్శకుడు బూతు చూపించాడా? నీతి ఏమైనా చెప్పాడా? అనే వివరాల్లోకి వెళితే... టెక్నాలజీ, శృంగారం... ఈ రెండింటి గురించి యువతకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెప్పాల్సిందంతా... అది చెడు మార్గానికి ఎలా తీసుకెళ్తుందన్నదే. ఇంకొకరు క్లాసులు పీకితే అర్థమయ్యే విషయం కానే కాదది.. అందుకే సమాజానికి నీతులు చెప్పే బాధ్యతను వ్యయప్రయాసలకోర్చి భుజాలమీదకు ఎత్తుకుంటున్న సునీల్ కుమార్ రెడ్డి ఆ విషయాన్ని చాలా అందంగా చెప్పారు. ఆ రెండు సమాజానికి చేసే మేలు అందరికీ తెలుసు, కానీ అవి ఏం కీడు చేస్తాయో, ఎందుకు చేస్తాయో చూడండి అంటూ ఆయన ఈ సినిమా తీశాడు.

    కథ విషయానికొస్తే...ముగ్గురు యువతులు. ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్, ఇంకొకరు బీటెక్. ముగ్గురు ప్రేమ కోసం తపిస్తుంటారు. నిత్యావసరాలకే ఇబ్బంది పడే కుటుంబంలోని ఓ అమ్మాయి ఓ అనాథ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. లవర్ ను ఎక్కించుకుని షికార్లు చేయడానికి పెట్రోలు కూడా కొన లేని స్థాయిలో ఉన్న హీరోకి తన ప్రేయసి కళ్లముందే స్నేహితులు అవమానిస్తారు. దీంతో అతను అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు ఒడిగడుతాడు. మరో అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ప్రేమ, ఆప్యాయత దొరక్క తన వయసు వాళ్లలో వెదుక్కుని తరచూ మోసపోతూఉంటుంది. ప్రేమే ఒక వ్యసనంగా బతుకుతుంటుంది. మరో అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది. అతను ఈ కథలో ఒక రకంగా విలన్ అనుకోవచ్చు. టెక్నాలజీని అమ్మాయిలను ట్రాప్ చేస్తూంటాడు. అలా ఈ అమ్మాయి కూడా అతడి వలలో పడి అడిగినంత డబ్బు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ముగ్గురి జీవితం చివరకు ఎటు దారితీసి ఎలా ముగిసిందన్నదే కథ.

    అయితే సాధారణంగా చూస్తే ఈచిత్రం ఒక బూతు అడల్డ్ చిత్రంగా కనిపిస్తుంది. కానీ సినిమాలో విషయాన్ని అర్థం చేసుకుంటే పేరెంట్స్‌కు ఒక మెసేజ్ లాంటిదీ సినిమా. ఈ సినిమా చూసిన పేరెంట్స్‌లో పిల్లలపై తమ బాధ్యతను గుర్తు చేస్తుందనక తప్పదు. అయితే సినిమాలో కొన్ని ఓవర్ డోసులు కూడా ఉన్నాయి. అవి మినహాయిస్తే అర్థం చేసుకోగల విషయం ఉందని చెప్పొచ్చు.

    English summary
    P Sunil Kumar Reddy’s ‘Oka Romantic Crime Katha’ is going to be remade in Kannada. Speaking on this occasion director Sunil said “The Kannada remake will be made with all new comers, ”. The film which depicts the life of three young girls, has full run at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X