twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’రీమేక్ వివరాలు

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో ఘనవిజయం సాధించిన 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేయనున్నట్లు దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నూతన తారలతో ఎక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 24 థియేటర్లలో ఈ సినిమా 50 రోజులు నడిచింది. ఈ సందర్భంగా ఈ సినిమాను మూడు భాష్లలోకి డబ్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం అనువాదం కానుంది

    ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -వివిధ ప్రాంతాలకు చెందిన యువతను మేల్కొలుపే ఉద్దేశంతో తమ సినిమా అనువాద కార్యక్రమం చేపడుతున్నట్లు దర్శకుడు అంటున్నాడు. ప్రత్యేకంగా టెన్త్ ,ఇంటర్మీడియట్ గర్ల్స్ ను విజ్ఞానవంతులు చేస్తామని సునీల్ పేర్కొన్నాడు.ఇప్పటివరకూ మా సంస్థలో వచ్చిన అన్ని సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో తొలిసారిగా బాక్సాఫీస్ విజయాన్ని కైవసం చేసుకోగలిగాం.

    ఇక ఒక చిన్న సినిమా 24 కేంద్రాల్లో 50 రోజులు ఆడటమనేది మామూలు విషయం కాదు. త్వరలోనే సినీ ప్రముఖుల సమక్షంలో అర్ధశతదినోత్సవం జరుపబోతున్నాం. టీనేజీ సెక్స్‌, అబార్షన్ల పై తెరకెక్కించిన ఈ సినిమాలో నిత్యం కనిపించే సంఘటనలనే చూపాను అన్నారు. డిజిక్వెస్ట్‌ ఇండియా సమర్పణలో, శ్రావ్య ఫిలింస్‌ పతాకంపెై తెరకెక్కింది. ఊరిని నమ్మినవారి కోసం 'సొంత ఊరు', గంగను నమ్మినవారి బతుకులపెై 'గంగపుత్రులు' తీశాను. మన ఉనికే చచ్చిపోతుంది అని చెప్పడానికి 'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ'ను తెరకెక్కించాను అని చెప్పారు.

    English summary
    Oka Romantic Crime Katha, a budget film, completes 50 days in 24 centers in AP. The film, which deals with with a very sensitive subject, rising juvenile delinquency, can be tipped as the biggest sleeper hit of the year, after Ee Rojullo. Says Sunil, "All my previous movies were critically acclaimed and have won Nandi Awards but we have tasted commercial success with Oka Romantic Crime Katha." The unit is planning to hold a function to celebrate the film's 50 days run at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X