For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఒక రొమాంటిక్ క్రైం కథ’లో ఉంది బూతా? నీతా?

  By Bojja Kumar
  |

  అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ తాజాగా 'ఒక రొమాంటిక్ క్రైం కథ' చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈచిత్రంలో అసభ్య సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయంటూ ఆరోపిస్తూ నిషేదించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న హెచ్‌ఆర్‌సి కేంద్ర సెన్సార్ బోర్డు డైరెక్టర్‌‌కు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు కూడా పంపింది.

  మరి ఈ సినిమాలో ఏముంది? దర్శకుడు బూతు చూపించాడా? నీతి ఏమైనా చెప్పాడా? అనే వివరాల్లోకి వెళితే... టెక్నాలజీ, శృంగారం... ఈ రెండింటి గురించి యువతకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెప్పాల్సిందంతా... అది చెడు మార్గానికి ఎలా తీసుకెళ్తుందన్నదే. ఇంకొకరు క్లాసులు పీకితే అర్థమయ్యే విషయం కానే కాదది.. అందుకే సమాజానికి నీతులు చెప్పే బాధ్యతను వ్యయప్రయాసలకోర్చి భుజాలమీదకు ఎత్తుకుంటున్న సునీల్ కుమార్ రెడ్డి ఆ విషయాన్ని చాలా అందంగా చెప్పారు. ఆ రెండు సమాజానికి చేసే మేలు అందరికీ తెలుసు, కానీ అవి ఏం కీడు చేస్తాయో, ఎందుకు చేస్తాయో చూడండి అంటూ ఆయన ఈ సినిమా తీశాడు.

  కథ విషయానికొస్తే...ముగ్గురు యువతులు. ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్, ఇంకొకరు బీటెక్. ముగ్గురు ప్రేమ కోసం తపిస్తుంటారు. నిత్యావసరాలకే ఇబ్బంది పడే కుటుంబంలోని ఓ అమ్మాయి ఓ అనాథ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. లవర్ ను ఎక్కించుకుని షికార్లు చేయడానికి పెట్రోలు కూడా కొన లేని స్థాయిలో ఉన్న హీరోకి తన ప్రేయసి కళ్లముందే స్నేహితులు అవమానిస్తారు. దీంతో అతను అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు ఒడిగడుతాడు. మరో అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ప్రేమ, ఆప్యాయత దొరక్క తన వయసు వాళ్లలో వెదుక్కుని తరచూ మోసపోతూఉంటుంది. ప్రేమే ఒక వ్యసనంగా బతుకుతుంటుంది. మరో అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది. అతను ఈ కథలో ఒక రకంగా విలన్ అనుకోవచ్చు. టెక్నాలజీని అమ్మాయిలను ట్రాప్ చేస్తూంటాడు. అలా ఈ అమ్మాయి కూడా అతడి వలలో పడి అడిగినంత డబ్బు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ముగ్గురి జీవితం చివరకు ఎటు దారితీసి ఎలా ముగిసిందన్నదే కథ.

  అయితే సాధారణంగా చూస్తే ఈచిత్రం ఒక బూతు అడల్డ్ చిత్రంగా కనిపిస్తుంది. కానీ సినిమాలో విషయాన్ని అర్థం చేసుకుంటే పేరెంట్స్‌కు ఒక మెసేజ్ లాంటిదీ సినిమా. ఈ సినిమా చూసిన పేరెంట్స్‌లో పిల్లలపై తమ బాధ్యతను గుర్తు చేస్తుందనక తప్పదు. అయితే సినిమాలో కొన్ని ఓవర్ డోసులు కూడా ఉన్నాయి. అవి మినహాయిస్తే అర్థం చేసుకోగల విషయం ఉందని చెప్పొచ్చు.

  English summary
  The whole content of ‘Oka Romantic Crime Katha’ is to make a point that kids know everything from childhood and the only thing a parent should do is channelize their thoughts, which otherwise will become uncontrollable devilish ideas. But general public and activists are feeling the ‘adult’ side of this content but not the actual intention it is made up of. Looks like, this is an acid test for director Sunil Kumar Reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X