ఆర్బీ చౌదరీ కుమారుడు హీరోగా ‘ఒకటే లైఫ్’.. ఆడియో విడుదల!

By Rajababu

లార్డ్ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యువ నిర్మాత నారాయణ రామ్ నిర్మిస్తున్న చిత్రం " ఒకటే లైఫ్" హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ఆడియో లాంచ్ ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో జరిగింది.

బి.జె.పి. అధికార ప్రతినిధి రఘునందన రావు ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి కుమారుడు రమేష్ చౌదరి హీరోగా నటిస్తున్నారంటే.. దీనిని సూపర్ గుడ్ కుటుంబం గా భావించవచ్చును. ఏ రంగం లో ఉన్నవారు. ఆ రంగంలో వారిని ప్రోత్సాహించాలి. కొత్తదనం రావాలి. చిన్న సినిమాలు బతకాలి. నాలుగు కుటుంబాలు. నలుగురు హీరోలే అంటే కుదరని పరిస్థితి వచ్చింది.. కొత్త వాళ్లు వస్తే కొత్త ఆలోచనలతో చిత్ర సీమ కొత్త కళలతో నిండుగా ఉంటుంది. అన్నారు.

నిర్మాత నారాయణ రామ్ మాట్లాడుతూ.. ఆడియో ఆవిష్కరణకు రఘునందనరావు రావడ. చాలా ఆనందంగా ఉంది. ఆడియో సక్సెస్ అయినట్లే ..సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను అని అన్నారు.

Okate life movie audio released

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ... నాకు ఇది తొలి అవకాశం నన్ను నమ్మి అవకాశం ఇచ్చి న నిర్మాతకు .. నాకు పూర్తి సహకారం అందించిన హీరోకి ధన్యవాదాలు.. టెక్నాలజీ తో పరుగు పెడుతున్న నేటి తరం.మానవత విలువలకు. కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో. తెరకెక్కిన చిత్రం. వచ్చే నెల లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు అని అన్నారు

హీరో రమేష్ చౌదరి మాట్లాడుతూ.. "ఒకటే లైఫ్" సినిమా నాకు పెద్ద టర్నింగ్ అవుతుంది. తెలుగు లో "విద్యార్థి" చిత్రం తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేశాను. చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం చేస్తున్నాను. యువత కి మంచి మెస్సేజ్ ఇచ్చే చిత్రం ఇది... దర్శక నిర్మాత లకు కృతజ్ఞతలు.అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X