పైరసీపై సినిమా: రొమాంటిక్ టచ్ కూడా
సినిమా పైరసీని ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని వినయ్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఒకే ఒక్క ఛాన్స్ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలోని ఇరవై నాలుగు విభాగాలపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి వెల్డింగ్ శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. నాగేంద్ర బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.
ఈ నెల మూడో వారంలో పాటలు, వచ్చే వారంలో సినిమాను విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా సినిమా పరిశ్రమను పైరసీ వెంటాడుతున్న విషయం తెలిసిందే. పైరసీ కారణంగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. దీంతో హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ పలు సందర్భాలలో పైరేటెడ్ చిత్రాలు చూడవద్దని ప్రేక్షకులను కోరుతున్నారు.
పైరసీ చిత్రాలు చూడవద్దని చెప్పేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఏ సినిమా ఆడియో విడుదలైన, సినిమా విడుదలైన సినీ ఇండస్ట్రీ పైరసీ పైన ప్రేక్షకులను చైతన్యవంతం చేసే ప్రోగ్రాం పెట్టుకుంటుంది. ఈ పైరసీ ఆధారంగా వెల్డింగ్ శ్రీను తాజాగా సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో పైరసీతో పాటు ప్రేమను కూడా మిళితం చేయనున్నారు.


Click it and Unblock the Notifications












