‘ఒక్క క్షణం’ ట్రైలర్స్ సూపర్: అల్లు శిరీష్ హిట్టుకొట్టేలా ఉన్నాడు!
అల్లు శిరీష్, సురభి జంటగా.... 'ఎక్కడికి పోతావు' చిన్నవాడా లాంటి హిట్ అందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఒక్క క్షణం'. లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ ఆకట్టుకుంది
‘ఒక్క క్షణం' మూవీ డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కుతోంది. రెండు పార్లల్ లైఫ్ లతో ముడిపడి వుంటుందని తెలుస్తోంది. ఒకరి ప్రెజెంట్ మరోకరి ఫ్యూచర్ అనే కాన్సెప్ట్‌తో వి ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అందరిలోనూ ఆసక్తి
ఈ మధ్య కాలంలో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్టు మూవీ తెలుగులో రాలేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

నటీనటులు
నటీనటులు - అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్, కాశి విశ్వనాథ్, రోహిణి, జయప్రకాష్, ప్రవీణ్, సత్య, సుదర్శన్, వైవా హర్ష, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి మురళి, రవి వర్మ, శ్రీసుధ, చిత్రం భాషా, భిందు, ప్రణవ్, బద్రం తదితరులు నటించగా...

తెర వెనక
కో ప్రొడ్యూసర్స్ - సతీష్ వేగేశ్న, రాజేష్ దండ
సంగీతం - మణిశర్మ
డిఓపి - శ్యామ్ కె నాయిడు
డైలాగ్స్ - అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ జి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ - నాగేంద్ర ప్రసాద్
క్రియేటివ్ హెడ్ - సంపత్ కుమార్
కో డైరెక్టర్ అండ్ అడిషనల్ డైలాగ్స్ - విజయ్ కామిశెట్టి
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను
బ్యానర్ - లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత - చక్రి చిగురు పాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - విఐ ఆనంద్


Click it and Unblock the Notifications











