»   »  డి-చానెల్ కు ఒక్కమగాడు

డి-చానెల్ కు ఒక్కమగాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
రెండు కోట్ల రూపాయలకు తులసి సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయంటేనే హా అని నోరు వెళ్లబెడితే ఇపుడు దానిని మించి మరో సినిమా అమ్ముడయింది. విచిత్రమేమంటే ఇంకా ఆ సినిమా పూర్తే కాలేదు. బాలకృష్ణ హీరోగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక్క మొగాడు సినిమా రూ.2.25 కోట్లకు డి-చానెల్ ఈ హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం. దాసరి నారాయణరావు ఈ డి-చానెల్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా పూర్తికానీ చిత్రం శాటిలైట్ హక్కులను ఇంకా మొదలేకానీ చానెల్ వారు అధిక మొత్తంతో కొనడం నిజంగా సంచలనమే.

Read more about: okka magadu balakrishna simran
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X