ఒక్క మగాడు అద్భుతాలు చేస్తాడు
బొమ్మరిల్లు పతాకంపై వరుసగా సినిమాలు స్వీయదర్శకత్వంలో నిర్మిస్తూ, విజయాలు కూడా సాధిస్తున్న వై.వి.ఎస్.చౌదరి ఒక్క మగాడు గురించి అప్పుడే ఊదరగొట్టేస్తున్నారు. బాలకృష్ణతో తమ సంస్థ సినిమా నిర్మిస్తోందని ప్రకటించి సంచలనం సృష్టించిన ఈ విలక్షణ దర్శకుడు అన్నట్టుగానే సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా పది రోజుల కిందటే ప్రారంభించేశారు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ జరిగే సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి సమ్మర్ రిలీజ్ చేయాలన్నది చౌదరి సంకల్పం. ఇదే విషయాన్ని చౌదరి ఇటీవల మీడియా వారితో ముచ్చటించారు.
ఒక్క మగాడు అద్భుతాలు చేస్తాడు అంటారాయన. హీరో బాలకృష్ణ అభినయంలో, వాచకంలో, ఆహార్యంలో అన్నింటా వైవిధ్యం కనిపిస్తుందని, ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అవుతారని నమ్మకంగా చెబుతున్నారు. ఆఖరికి డాన్స్ మూమెంట్స్ కూడా కొత్తగా ఉంటాయి. మణిశర్మ ఇప్పటివరకు బాలకృష్ణ చిత్రాలకు ఇచ్చిన హిట్స్ కన్నా ఇంకా గొప్పగా ఉంటాయి పాటలు.. ఈ చిత్రంలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారిద్దరూ యువతరం హృదయాలు కొల్లగొట్టే వారే అవుతారు. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత నిపుణులైన టెక్నీషియన్లంతా ఈ చిత్రానికి పని చేస్తారు. ఈ చిత్రం సమ్మర్ రిలీజ్ కింద ఏప్రిల్ 28న విడుదల అవుతుంది. ఈ సినిమా స్మాష్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ చిత్రానికి కథ ఎం.ఎస్. ప్రకాశ్. స్క్రిప్ట్ పోసాని కృష్ణమురళి. డైలాగ్స్ చింతపల్లి రమణ. సంగీతం మణిశర్మ. పాటలు చంద్రబోస్. కెమెరా మధు ఎ నాయుడు. ఆర్ట్ ఆనంద్ సాయి. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు. ఫైట్స్ విజయ్. సహ నిర్మాత యలమంచిలి యుక్త.


Click it and Unblock the Notifications