twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారా రోహిత్ ‘ఒక్కడినే’లో కండోమ్స్‌కు కత్తెర!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడుగా అందాల నటి నిత్య మీనన్ నాయకిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాగ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వాన 'ఒక్కడినే' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

    తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానకి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కట్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈచిత్రంలో 'కండోమ్స్ వాడికి తొడిగినట్లు ఫీలవుతున్నాడు' అనే డైలాగ్ తో పాటు, డాన్సర్ బొడ్డుపై వేలు పెట్టే సన్నివేశం, మరికొన్ని హింసాత్మక, అభ్యంతరకర సన్నివేశాలను సెన్సార్ బోర్డు కట్ చేసింది.

    త్వరలోనే ఈచిత్రం విడుదల తేదీ ఖరారు కానుంది. నారా రోహిత్ చేసిన 'సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన 'ఇష్క్' చిత్రాలు రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్‌కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు. ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు.

    నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈచిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, బెనర్జీ, జీవి, అలి, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరామెన్: ఆండ్రుబాబు, కళ: నాగేంద్ర, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: గణేష్, కో డైరెక్టర్: కళ్యాణ్, ప్రొడక్షన్: తాండవ కృష్ణ, నిర్మాత: సివి.రెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.

    English summary
    
 Nara Rohit and Nithya Menon-starrer ‘Okkadine’ has completed its censor scrutiny and awarded with clean U/A certificated. The movie has been postponed due to some financial issues. According to fresh reports coming in the film is likely to release on next month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X