నిత్యా మీనన్ తో గోవాలో నారా రోహిత్
హైదరాబాద్ : సోలో' సినిమా ద్వారా మంచి విజయం సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ 'ఒక్కడినే'అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జెనిలియాతో 'కథ' చిత్రం చేసిన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం లవ్, యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతోంది. గుళాబీ మూవీస్ పతాకంపై నిర్మాత సి.వి.రెడ్డి నిర్మిస్తున్నారు.
ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత వివరిస్తూ - మిగిలిన ఒక్క పాటను గోవాలో చిత్రీకరణ చేస్తున్నట్టు తెలిపారు. మా చిత్రం కోసం షూటింగ్ చేయాల్సిన డ్యూయెట్ సాంగ్‌ని గోవాలోని సుందర ప్రదేశాలలో నారా రోహిత్ - నిత్యామీనన్‌లపై చిత్రీకరించడం జరిగింది. ఈ పాట చిత్రీకరణతో నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, బ్రహ్మానందం, యం.యస్.నారాయణ, జీవీ, అలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరా: ఆండ్రూ బాబు, కళ: నాగేంద్ర, ఫైట్స్: గణేష్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస రాగ.
నారా రోహిత్ త్వరలో 'మద్రాసి'అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్థానం ఫేం రవి వల్లభనేని నిర్మాత.


Click it and Unblock the Notifications











