ఆర్థిక సమస్యల్లో ‘ఒక్కడినే’-విడుదల వాయిదా
హైదరాబాద్ : నారా రోహిత్ కథానాయకుడుగా, శ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. ఈచిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ వీలు కాక ఈ నెల 14న డేట్ ఫిక్స్ చేసారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల మరోసారి సినిమాను వాయిదా వేసి డిసెంబర్ 21న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది. సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది.
ఈ కథ గురించి నిర్మాత సివీ రెడ్డి ఆమధ్య ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ...ప్రేమంటే రెండు మనసుల కలయిక. నిదురలోనైనా, మెలకువలోనైనా... ఆ మధురమైన జ్ఞాపకాలే తోడుగా ఉంటాయి. ప్రేమ మొగ్గ తొడిగిందంటే ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికిట్టే లెక్క. కానీ ఓ యువకుడికి మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలోపడిన తరవాతే అతను ఒంటరిగా మిగిలాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు.
నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బెనర్జీ, అలీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్నారు. మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కోడైరెక్టర్: కల్యాణ్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రాగ.


Click it and Unblock the Notifications











