‘ఒక్కడినే’ అంటున్న నారా రోహిత్
'సోలో' సినిమా ద్వారా మంచి విజయం సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ ఈ సినిమా తర్వాత మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి.వి.రెడ్డి గులాబి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'ఒక్కడినే' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఫిబ్రవరి 15 నుంచి అరకులోని పకృతి అందాల మధ్య షూటింగ్ జరుపుకోనుంది. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న నారా రోహిత్ పరిశ్రమలో అగ్రహీరోగా నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. జూన్ నెలలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.
కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, చంద్రమోహన్, నాగబాబు, సుధ, జి.వి, స్నిగ్ధ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టెక్కిల్ విషయాలకొస్తే...ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఆండ్రూ, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: నాగేంద్ర, ఫైట్స్: గణేష్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ రాగ.


Click it and Unblock the Notifications











