ప్రేమికుల రోజు ‘ఒక్కడినే’
హైదరాబాద్: నారా రోహిత్ కథానాయకుడుగా, శ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ఖరారైంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ.. వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది. ఫ్యామిలీ బంధాల తీవ్రతను ఓ కొత్త కోణంలో ఈచిత్రంలో చూపించనున్నారట.
ఈ కథ గురించి నిర్మాత సివీ రెడ్డి మాట్లాడుతూ...ప్రేమంటే రెండు మనసుల కలయిక. నిదురలోనైనా, మెలకువలోనైనా... ఆ మధురమైన జ్ఞాపకాలే తోడుగా ఉంటాయి. ప్రేమ మొగ్గ తొడిగిందంటే ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికిట్టే లెక్క. కానీ ఓ యువకుడికి మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలోపడిన తరవాతే అతను ఒంటరిగా మిగిలాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు.
నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బెనర్జీ, అలీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్నారు. మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కోడైరెక్టర్: కల్యాణ్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రాగ.


Click it and Unblock the Notifications












