twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారా రోహిత్ ‘ఒక్కడినే’ రిలీజ్ డేట్ ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : నారా రోహిత్ కథానాయకుడుగా, శ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 23న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది. సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్‌ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది.

    ఈ కథ గురించి నిర్మాత సివీ రెడ్డి మాట్లాడుతూ...ప్రేమంటే రెండు మనసుల కలయిక. నిదురలోనైనా, మెలకువలోనైనా... ఆ మధురమైన జ్ఞాపకాలే తోడుగా ఉంటాయి. ప్రేమ మొగ్గ తొడిగిందంటే ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికిట్టే లెక్క. కానీ ఓ యువకుడికి మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలోపడిన తరవాతే అతను ఒంటరిగా మిగిలాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు.

    నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బెనర్జీ, అలీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్నారు. మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కోడైరెక్టర్: కల్యాణ్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రాగ.

    English summary
    
 Nara Rohith-Nithya Menen's forthcoming entertainer Okkadine will release on November 23. The action drama, which expounds love and familial affection with reference to the contemporary living, is nearing post production formalities and gearing for release in November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X