విశాల్‌ 'ఒక్కడొచ్చాడు' సెన్సార్‌ పూర్తి - డిసెంబర్‌ 23 విడుదల

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒక్కడొచ్చాడు'.

By Bojja Kumar

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ లెవల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు.

Okkadochadu

ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''మా 'ఒక్కడొచ్చాడు' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. హీరో విశాల్‌ కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌ క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందిన సినిమా ఇదే. డిసెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో 2,100 థియేటర్లలో చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. విశాల్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ బడ్జెట్‌తో చాలా లావిష్‌గా నిర్మించిన ఈ చిత్రం అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. '' అన్నారు.

విశాల్‌, తమన్నా, ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె. సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహ నిర్మాత: ఇ.కె. ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X