శ్రీదేవి సవితి కొడుకుతో మహేష్ ‘ఒక్కడు’ రీమేక్
ముంబై: ప్రిన్స్ మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఒక్కడు. ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ డైరక్ట్ చేసిన ఈ చిత్రం బోనీ కపూర్ మొదటి భార్య తనయుడు అర్జున్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఇటవలే బోనీ కపూర్ ఈచిత్రం రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్టుని హిందీకి మార్పులు చేర్పులతో రెడీ చేయిస్తున్నారు.
ఈ విషయమై బోనీ కపూర్ మీడియాతో మాట్లాడుతూ...'అర్జున్ కపూర్ హీరోగా ఒక్కడు సినిమా చేయబోతున్నామని' స్పష్టం చేసారు. అయితే ఈచిత్రానికి దర్శకుడు, హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలు ఖరారు కావాల్సి ఉంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే అర్జున్ కపూర్ 'ఇషక్‌జాదే' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు పోషించిన పాత్ర అర్జున్‌కు కరెక్ట్ గా సూటవుతుందని, అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఆ సినిమాకు పర్ ఫెక్ట్ గా ఉంటుందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.
అర్జున్ కపూర్ ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి సవితి కొడుకు. బోని కపూర్-మోనా పెళ్లయిన పదేళ్ల తర్వాత విడి పోయారు. వీరి సంతానమే అర్జున్ కపూర్. ఆ తర్వాత బోనీ కపూర్ నటి శ్రీదేవిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీదేవి నటించిన 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం నిన్న విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











