»   » దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్

దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్ర్యూస్ 'ఒక్కడు మిగిలాడు' సినిమాను తెరకెక్కించాడు. "దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది.

థియెట్రికల్‌ ట్రైలర్‌

థియెట్రికల్‌ ట్రైలర్‌

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళ్, క‌న్న‌డంలో ఈ మూవీ రిలీజ్ అవ‌నుంది. 'ఒక్కడు మిగిలాడు' థియెట్రికల్‌ ట్రైలర్‌ను శనివారం ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు మనోజ్‌. 'భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు?. తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా?' అనే ఉద్విగ్నభరిత వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది.


ఎల్టీటీఈ పోరాటాన్ని గుర్తుకు తెచ్చేలా

ఎల్టీటీఈ పోరాటాన్ని గుర్తుకు తెచ్చేలా

శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతోంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఈ సినిమా కాన్సెప్ట్ తమిళ పులుల పోరాటమే అని స్పష్టం అవుతోంది. ఈ సినిమా డైలాగులు శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.


తీవ్రవాదులనే ముద్ర ఉంది

తీవ్రవాదులనే ముద్ర ఉంది

తమిళ టైగర్లకు తీవ్రవాదులనే ముద్ర ఉంది. అయితే తమది స్వతంత్ర పోరాటంగా, ప్రత్యేక దేశ సాధనగా వారు చెప్పుకునే వారు. ఒక్కడు మిగిలాడు. 1990 శ్రీలంక సివిల్ వార్ బ్యాక్‌డ్రాప్ లోనిది. 1990లో శ్రీలంకలోని 15 లక్షల మంది శరణార్థుల కోసం జరిగిన యుద్ద నేపథ్యంలో తెరకెక్కుతోంది.


డ్యూయల్ రోల్‌లో

ఇందులో మనోజ్ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్ రోల్‌తో పాటు విద్యార్థి నాయకుడిగా డ్యూయల్ రోల్‌లో కనిపిస్తాడు. 'ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి. స్వేచ్చ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే' అనే మరో డైలాగ్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి అజయ్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహిస్తుండగా, లక్ష్మీకాంత్‌, ఎస్‌ఎన్‌ రెడ్డిలు నిర్మిస్తున్నారు.


English summary
Manchu Manoj plays a double role for the first time in the film. He plays the controversial LTTE chief Prabhakaran and a student leader. Prabhakaran was widely regarded as the head of a terror organisation that was leading a bloody insurgency in the island nation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu