twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఒక్కడు' మూవీలో హీరో సెలెక్షన్.. చాలా రిస్క్ చేశాం.. చార్మినార్ సెట్ కూలిపోయింది కూడా: నిర్మాత

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో 'ఒక్కడు' ప్రధానమైంది. 2003లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న గత రికార్డులను ఒక్కసారిగా బ్లాస్ట్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మాత MS రాజు నిర్మించిన ఒక్కడులో మొదట ఏ హీరోను అనుకున్నారు? అసలు ఆ సినిమాను మహేష్ ను సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలపై నిర్మాత MS రాజు ఇటీవల వివరణ ఇచ్చారు.

    మంచి జడ్జిమెంట్ ఉన్న నిర్మాత

    మంచి జడ్జిమెంట్ ఉన్న నిర్మాత

    నిర్మాతగా MS రాజు అంటే ఒకప్పుడు మంచి జడ్జిమెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్ అనే చెప్పాలి. సమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అంటే అప్పట్లో ఒక సక్సెస్ ఫుల్ బ్యానర్ గా మంచి క్రేజ్ అందుకుంది. వెంకటేష్ శత్రువు సినిమాతో ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన రాజు గారు ఆ తరువాత పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్, దేవి, దేవిపుత్రుడు, మనసంతా నువ్వే వంటి సినిమాలను నిర్మించారు.

    మళ్ళీ దర్శకుడిగా మారి

    మళ్ళీ దర్శకుడిగా మారి

    ఇక 2003లో మహేష్ బాబుతో మొదటిసారి చేసిన ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని నిర్మాత ఎమ్ఎస్.రాజు తన స్థాయిని పెంచుకున్నాడు. అయితే ఇటీవల ఆయన డర్టీ హరి అనే సినిమాతో మళ్ళీ దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఒక్కడు సినిమాను గుర్తు చేసుకున్నారు.

    ఒక్కడు సినిమాకు మొదట ఏ హీరో..?

    ఒక్కడు సినిమాకు మొదట ఏ హీరో..?

    ఒక్కడు సినిమాలో మొదట వేరే హీరోలను అనుకున్నట్లు అప్పట్లో ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. కానీ నిజానికి అందులో మొదట మహేష్ బాబును తప్పితే మరొక హీరోను అనుకోలేదట. దర్శకుడు గుణశేఖర్ కూడా మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొని కథను చాలా తెలివిగా తెరపైకి తీసుకువచ్చినట్లై నిర్మాత తెలియజేశారు.

    మహేష్ బాబును తీసుకోవడానికి కారణం..

    మహేష్ బాబును తీసుకోవడానికి కారణం..

    సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని అందరికి ఒక నమ్మకం వచ్చేసింది. మెయిన్ గా మహేష్ బాబును తీసుకోవటానికి కారణం.. ఆయన కృష్ణ గారి కొడుకు అవ్వడం వలనే. ఒక కొత్త వారిని పెట్టి తీస్తే అంత కిక్కు ఉండదు. ముఖ్యంగా కొండారెడ్డి బురుజు సీన్ లో ప్రకాష్ రాజ్ ను కొట్టే సీన్ చూసినపుడే సినిమాపై నమ్మకం వచ్చేసిందని అన్నారు.

     అప్పుడే క్లారిటీ వచ్చేసింది..

    అప్పుడే క్లారిటీ వచ్చేసింది..

    కొండారెడ్డి బురుజు సీన్ లో మహేష్ అలా నడుచుకుంటూ వస్తుంటే నాకైతే సూపర్ స్టార్ కృష్ణ గారు కనిపించారు. మహేష్ ఆ సినిమా చేశాడు కాబట్టే అంత పెద్ద హిట్ అయ్యింది. ఎదో చిన్న హీరోనో కొత్త హీరోని పెట్టుకొని ఉంటే అంత పెద్ద స్థాయిలో సినిమా విజయం సాధించి ఉండేది కాదని అన్నారు.

    చార్మినార్ సెట్ కూలిపోయింది..

    చార్మినార్ సెట్ కూలిపోయింది..

    అప్పట్లో చాలా రిస్క్ బడ్జెట్ తో సినిమాను నిర్మించడానికి ధైర్యం చేశాం. అందుకు ముఖ్య కారణం మహేష్ బాబు అనే చెప్పాలి అంటూ గుణశేఖర్ కథ రాసుకున్నప్పుడు కూడా నాకు చాలా నమ్మకం వచ్చిదని MS రాజు తెలియజేశారు. ఇక రామానాయుడు గారికి చెందిన ఒక స్థలంలో ఒక్కడు సినిమా కోసం చార్మినార్ సెట్ వేయడం జరిగిందని అయితే ఒకసారి కూలిపోయినప్పటికీ మళ్ళీ నిర్మించినట్లు చెప్పారు.

    సినిమా మీద నమ్మకంతో ఏ మాత్రం తగ్గకుండా నిర్మించినందువల్ల మంచి విజయం దక్కిందని కూడా ఎమ్ఎస్.రాజు తెలియజేశారు.

    Recommended Video

    F3 Movie Launched With Pooja Ceremony

    English summary
    In the Tollywood industry, everyone is talking about the first look of Mahesh Babu's new film. Sarkaru vaari paata along with their title, Mahesh Babu's new look has also increased the dose of anticipation in the film. If not, there are many rumors of ruminations on this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X