అంచనాలకు అనుగుణంగానే బాలకృష్ణ సినిమా ఒక్క మగాడు భారీగా బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500 థియేటర్లలో 11న విడుదల కానున్న ఈ సినిమా బాలకృష్ణ నటించిన అన్ని చిత్రాలలోకెల్లా అత్యధికంగా మొత్తం 25కోట్ల రూపాయలకు బిజినెస్ చేసిన చిత్రంగా ఒక్కమగాడు రికార్డు సృష్టించింది. ఆంధ్రా ప్రాంతానికి 8కోట్లు, నైజాం ఏరియాకు 4.5 కోట్లు, సీడెడ్ ఎరియాకు 5కోట్లు అమ్మినట్టు తెలుస్తోంది. ఇంకా ఓవర్ సీస్, ఆడియో, శాటిలైట్, ఇతర రాష్ట్రాల హక్కుల ద్వారా భారీ మొత్తం లభించినట్టు సమాచారం. దర్శక నిర్మాత వైవియస్ చౌదరి అత్యంత శ్రద్ధతో ఆదినుంచి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించినట్టు చెబుతున్నారు.