ఒక్క మగాడుకు నైజాంలో రూ.4.55కోట్లు
శివాజీ, సీమశాస్త్రి లాంట సినిమాలను నైజాం ఏరియాలో విడుదల చేసిన పిరమిడ్ సాయిమీరా పంపిణీ సంస్థ ఒక్క మగాడు సినిమా నైజాం హక్కులను కైవసం చేసుకుంది. బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్, నిషా కొఠారి హీరో హీరోయిన్లుగా నటించిన ఒక్క మగాడు సినిమాను వైవియస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నైజాం హక్కులను రూ.4.45 కోట్ల మినిమమ్ గ్యారంటీతో దక్కించుకుంది. జనవరి 11న ఈ సినిమా విడుదల అవుతున్నది. ఈ సినిమాను నైజాంలో అత్యధిక ప్రింట్లతో విడుదల చేయాలని పిరమిడ్ సాయిమీరా సంస్థ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని థియేటర్లను కూడా లీజ్ కు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా లార్వ్ ఎంటర్టైన్ మెంట్ సంస్థ ఆసియా-పసిఫిక్ థియేట్రికల్ హక్కులను పొందింది. ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, న్యూజిలాండ్ దేశాలు ఇందులోకి వస్తాయి.


Click it and Unblock the Notifications











