అమల బర్త్ డే స్పెషల్....‘ఒక్కసారి ఓ ముద్దు’(సాంగ్)
హైదరాబాద్: శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్'. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. మా బేనర్లో రోషన్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది, నిర్మల కాన్వెంట్ చిత్ర ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అన్నారు నాగార్జున. ఈ నెల 24న నాగార్జున భార్య అమల అక్కినేని పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నాగార్జున 'నిర్మలా కాన్వెంట్' చిత్రానికి సంబంధించిన ‘ఒక్కసారి ఓ ముద్దు' సాంగ్ విడుదల విడుదల చేయాలని డిసైడ్ చేసారు. దాదాపు 10 రోజుల ముందుగానే అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన సోషల్ మీడియా పేజీ ద్వారా ఈ సాంగ్ విడుదల చేసారు.
శ్రీకాంత్ కొడుకు రోషన్‌కు సంబంధించిన ఫోటోలు ఇటీవల నాగార్జున విడుదల చేసారు. నూనూగు మీసాలతో లవర్ బాయ్‌గా ఆకట్టుకునే లుక్‌తో రోషన్ హాట్ టాపిక్ అయ్యాడు. శ్రీకాంత్-ఊహ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారులు రోషన్, రోహన్, కుమార్తె మేధ. పెద్ద కొడుకు రోషన్ వయసు 20 సంవత్సరాల లోపే. ఈ క్యూట్ లవ్ స్టోరీ ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం చేస్తున్నారు.

జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయా శర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు.
జైపూర్ లో మొదటి షెడ్యూల్, మెదక్ లో రెండో షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుండి అరకులో జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఇంకా ఆదిత్య మీనన్, సత్యకృష్ణ, అనితా చౌదరి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











