twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎయిడ్స్ తో మాజీ స్టార్ హీరోయిన్ ...మరణానికి దగ్గరగా...

    By Srikanya
    |

    హైదరాబాద్ : గ్లామర్ ప్రపంచం ఒక్కోసారి షాక్ కొట్టే నిజాలని మన ముందు పెడుతూంటుంది. తాజాగా అలాంటి ఓ వార్త సినీ ప్రేమికులను విషాదంలో ముంచేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, యూనివర్శల్ హీరో కమలహాసన్‌లతో నటించిన నటి నిషా ఎయిడ్స్ కోరలో చిక్కుకుని మరణపు అంచులలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈమె పరిస్ధితి తెలిసిన అభిమానులు, తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. గతంలో ఆమె బాలచంద్రన్, విశు, చంద్రశేఖర్‌ వంటి ప్రముఖుఏల దర్శకత్వంలో ఆమె నటించారు.

    తమిళనాడు నాగపట్టణం జిల్లా నాచూర్ గ్రామానికి చెందిన నిషా ఎయిడ్స్ రోగంతో బాదపడుతున్న ఫోటోలు ఈ మధ్యకాలంలో వాట్సాప్,ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్ సైట్‌లలో ప్రచారం అయ్యాయి. ఆ ఫొటోలలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అస్థి పంజరం లాంటి దేహంతో ఆమె ఉంది. నాబూర్ దర్గా సమీపంలో వారం రోజులుగా అనాథగా పడి వున్న నటి నిషాను పట్టించుకున్నవారులేరు. ఆమె శరీరంనిండా చీమలు, ఈగలు ముసిరి ఉన్నాయి.

     ‘Old Tamil Actress Nisha Affected by Aids Disease’

    ముప్ఫై సంవత్సరాల క్రితం ప్రవేసించి, ఓ వెలుగు వెలిగిన నిషా ఇలాంటి పరిస్ధితి ని ఎవరూ ఊహించలేరు.ఈ నేపధ్యంలో ఆమె దయనీయ స్థితిని తెలియజేస్తూ, ఫోటోలతో సహా ఒక మెస్సేజ్ జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు న్యాయమూర్తి మురుగేశన్ కు అందింది. వాటిని చూసిన వెంటనే స్పందించారు. నిషాకు వెంటనే వైద్య చికిత్సలకు ఏర్పాటు చేయాల్సిందిగా నాగపట్టణం జిల్లా కలెక్టర్‌ని, పోలీసు సూపరింటెండెంట్ ని ఆదేశించారు. ఆమె ఆరోగ్య వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

    నిషా గతంలో కమలహాసన్ సరసన టిక్ టిక్ టిక్ చిత్రంలోను, రజనీకాంత్‌తో రాఘవేంద్ర చిత్రంలోను నటించారు. ఇంకా కల్యాణ అగధిగళ్, మయిలుక్కు మూనుకాల్ మొదలగు పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించారు.

    English summary
    Nisha, who was seen in films like Tick Tick Tick, Raghavendra and Kalyana Agadhigal, is in a very pitiable condition. The actress was found on the streets in Nagoor, which is her birthplace. According to sources, Nisha is affected with AIDS following which her family had disowned her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X