»   » మీరు నమ్మలేని నిజం ... ఘాజి ఒక షార్ట్ ఫిలిం కథ

మీరు నమ్మలేని నిజం ... ఘాజి ఒక షార్ట్ ఫిలిం కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రానా హీరోగా నటించిన తాజా చిత్రం 'ఘాజీ'. 1971 లో ఇండియా-పాకిస్థాన్‌ మధ్య జరిగిన సబ్ మైరైన్‌ వార్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ జరుపుకుంది. ఎటువంటి కోతలు విధంచకుండా సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'క్లీన్ యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు, సినిమా చూసిన అనంతరం ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని తీసినందుకు యూనిట్‌ ను విపరీతంగా అభినందించారట.

రెండో ప్ర‌పంచ‌యుద్ధ స‌మ‌యంలో ఘాజీ అనే నావికాద‌ళ యుద్ధ నేప‌థ్యంలో న‌డిచే క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా కథ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.సెన్సార్ టాక్ ప్ర‌కారం ఘాజీ లాంటి సినిమా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని వారు కితాబు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు, స‌బ్‌మొరైన్ నేప‌థ్యంలో వ‌చ్చే సీన్లు, ఎమోష‌న‌ల్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేస్తాయ‌ట. ఏదేమైనా రానాకు ఘాజీతో సోలో హిట్ ద‌క్క‌డం ఖాయ‌మ‌న్న టాక్ అయితే వ‌చ్చేసింది.

ollywood Hero Rana daggubaTi Said how he Became a part of the movi Ghazi and his jurny with Ghazi Team

అయితే ఇక్కడ మీరు షాక్ తినే విషయం ఒకటుంది. నిజానికి ఇది మరీ సీక్రెట్ ఏం కాదు గానీ ఇండస్ట్రీ లో తప్ప బయట పెద్ద్దగా తెలియని విషయం ఏమిటంటే ఘాజీ స్టోరీ మొదట రాసుకున్నదీ, సెట్టింగ్ వేసిందీ షార్ట్ ఫిలిం చేయటానికే. దర్శకుడు సంకల్ప్ రెడ్ది ఘాజీ ని మొదట షార్ట్ ఫిలిం చేద్దామనుకొని ట్యాంక్ బండ్ దగ్గర సబ్ మెరైన్ సెట్ వేసాడట. అయితే అనుకోకుండా తన దృష్టిలో పడటం తో అది కాస్తా పెద్ద సినిమా అయిపోయింది. రానా స్టారింగ్ తో మరింత బడ్జెట్ పెంచుకోవటానికి వీలయ్యింది. అదే వీషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో రానా ఇలా చెప్పాడు.

నిజానికి ఘాజీ కథ తో నాదగ్గరికి ఎవరూ రాలే దు ఈ కథను నేనే వెతుక్కుని తెచ్చుకున్నాను. దర్శకుడు సంకల్ప్‌ ఒక షార్ట్‌ఫిలిం కోసం ట్యాంక్‌బండ్‌ దగ్గర సబ్‌మెరైన సెట్‌ వేస్తుండడం చేశాను. నేను ఎలాగూ కొత్త కథలు కోసం ఎదురుచూస్తుంటాను. 'ఘాజీ' యుద్ధం గురించి విన్న తరువాత వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. సినిమాయే చేద్దామని సంకల్ప్‌కు చెప్పాను.

అలా 'ఘాజీ' మొదలైంది. ఈ సినిమా కేవలం డబ్బుతో ముడిపడింది కాదు. చరిత్ర, భారత నేవీ ధైర్యసాహసాలు, భావోద్వేగాలు మరెన్నో వున్నాయి.ఇండియాలో ఇటువంటి సినిమాలు తక్కువ. యుద్ధం అంటే ఎలా ఉంటుందో మన వినడమేగానీ, ఎప్పుడూ చూడలేదు. సముద్రంలో నీటి లోపల యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అంటూ ఘాజీ కథ లో తానెలా భాగమయ్యనో చెప్పాడు రానా.

English summary
Tollywood Hero Rana daggubaTi Said how he Became a part of the movi Ghazi and his jurny with Ghazi Team
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu